28న రానున్న మరో ‘సింహ’ గర్జన!
టాలీవుడ్ ఎప్పుడూ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంది. గతంలో 'న" అక్షరం తో వచ్చిన 'నువ్వే కావాలి" హిట్ అయ్యేసరికి వరుసగా 'నవ్వునాకు నచ్చావ్", 'నువ్వులేక నేను లేను" తర్వాత 'బ్లేడు బాబ్జి', 'బెండు అప్పారావు', 'బెంటింగ్ బంగారాజు' అంటూ చాలా చిత్రాలొచ్చాయి. తాజాగా 'సింహా' హిట్ అయ్యేసరికి 'సింహాం" టైటిల్ తో సినిమాలు రానున్నాయి.
సూర్య తమిళంలో నటించిన 'సింగం" (అంటే సింహం) సినిమాను అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. సూర్య నటించిన 25వ సినిమా ఇది. సింహాలో బాలకృష్ణ మాదిరి గుబురు మీసాల్లో సూర్య కనిపించనున్నాడు. 'లక్ష్మీ నరసింహా" మాతృక విక్రమ్ తో 'సామి" చిత్రాన్ని తెరకెక్కించిన హరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సూర్య ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సూర్య సరసన కథానాయికగా సూర్యతో మొదటిసారిగా అనుష్క నటిస్తోంది. వీరి కాంబినేషన్ ఆన్ స్ర్కీన్ పై చూడటానికి అభిమానులు చాలా అతృతగా ఉన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ చక్కటి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయుటకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











