సూర్య 'యముడు'..కన్నడ రీమేక్ రిజల్ట్ ఏమిటి?

By Srikanya

తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన సింగం(తెలుగు యముడు) చిత్రం నిన్న(గురువారం)కన్నడ భాషలోకి కెంప గౌడ టౌటిల్ తో రీమేక్ అయి విడుదలైంది.రక్త చరిత్ర ఫేమ్ సుదీప్ హీరోగా చేసిన ఈ చిత్రం అక్కడ కూడా హిట్ టాక్ ని తెచ్చుకుంది.విపరీతమైన ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుదీప్ స్వయంగా డైరక్ట్ చేయటం కూడా క్రేజ్ కి కారణమైంది. సుదీప్ సరసన రాగిణి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో తమిళంలో ప్రకాష్ రాజ్ చేసిన విలన్ పాత్రను రవి శంకర్ పోషించారు.కథ గా చెప్పుకోవటానికి పెద్ద మలుపులు లేకపోయినా స్క్రీన్ ప్లే పరంగా స్పీడుగా నడవటం ఈ చిత్రం స్పెషాలిటి.అలాగే పంచ్ డైలాగ్ లు,మీసకట్టు,మాస్ కామిడి,హీరోయిన్ ట్రాక్ అన్ని ఈ చిత్రంలో సమపాళ్ళలో ఉండటం ప్లస్ గా మారింది.ఇక ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందిలో అజయ్ దేవగన్ చేయనున్నారు.గోల్ మాల్ త్రీ డైరక్ట్ చేసిన రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.అక్కడ కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉందని అప్పుడే ట్రేడ్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X