బస్సులో అమ్మాయిలను తడిమితే ప్రశంసలా? బిగ్‌బాస్, కమల్‌పై చిన్మయి ఫైర్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా కొనసాగుతున్న తమిళ బిగ్‌బాస్ 3 షో వివాదాల నడుమ కొనసాగుతున్నది. తాజాగా బిగ్ బాస్ తమిళ్ కార్యక్రమం మరో వివాదంలో కూరుకుపోయింది. తాజా షోలో ఇంటి సభ్యుడిగా ఉన్న నటుడు శరవణన్ చేసిన వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కమల్, శరవణన్‌పై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రస్థాయిలో మండిపడింది. వివరాల్లోకి వెళితే..

కిక్కిరిసిన బస్సులో అమ్మాయిలు
గత శని, ఆదివారాల్లో ప్రసారమైన ఎపిసోడ్స్‌లో కమల్ హాసన్ బస్సులో మహిళల కష్టాలను ప్రస్తావించారు. కిక్కిరిసిన బస్సులో ప్రయాణించడం చాలా కష్టం. ఆఫీస్‌కు వెళ్లే తొందరలో ఉంటే.. కొందరు మహిళలను చెప్పలేని చోట టచ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తారు అనే విషయాన్ని కమల్ ప్రస్తావించారు. అమ్మాయిలను ఇలాంటి సమస్యలు ఎన్నో వెంటాడుతున్నాయి అంటూ గరం అయ్యారు.

నేను అలాంటి వాడినే అంటూ
కమల్ చెప్పిన మాటలు విని.. వెంటనే బిగ్‌బాస్ కంటెస్టెంట్ శరవణన్ నేను కూడా అలాంటి వాడినే.. అమ్మాయిల దేహాన్ని తడిమి వాడిని. కాలేజీకి వెళ్లే సమయంలో అమ్మాయిలు, మహిళలను టచ్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి పనులు చేయను. మారిపోయాను అంటూ శరవణన్ అన్నారు.

తప్పు తెలుసుకొని పవిత్రంగా అంటూ
శరవణన్ చెప్పిన మాటలు విని కమల్ హాసన్ అభినందించాడు. అంతేకాకుండా గుణ సినిమాలోని ఓ డైలాగ్‌ను వేదిక మీద నుంచి పంచుకొన్నారు. శరవణన్ చాలా తప్పు చేశాడు. కానీ ఇప్పుడు చాలా స్వచ్ఛమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రస్తుతం పవిత్రంగా ఉంటున్నాడు అని కమల్ పేర్కొన్నాడు. దాంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు.
కమల్‌పై చిన్మయి తీవ్ర మండిపాటు
అయితే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన శరవణన్‌కు కమల్ హాసన్ కితాబు ఇవ్వడమేంటనే పాయింట్‌ను గాయని చిన్మయి లేవనెత్తారు. పబ్లిక్‌గా బస్సులో మహిళలను, అమ్మాయిలను వేధించాను. తడిమి ఆనందం పొందినానని ఓ వ్యక్తి గొప్పగా చెప్పుకొంటే.. ప్రముఖ తమిళ ఛానెల్ అదేదో ఘనకార్యమని ప్రసారం చేసింది. ఆయన ఘనకార్యం ఏదో జోక్ అయినట్టు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. అమ్మాయిలు కూడా ఆయనకు చప్పట్లు కొట్టడం దారుణం అని చిన్మయి అన్నారు.


Click it and Unblock the Notifications