»   » అంతా షాక్ :సుచి లీక్స్.. మధ్యలో అల్లు అర్జున్ పేరు కూడా

అంతా షాక్ :సుచి లీక్స్.. మధ్యలో అల్లు అర్జున్ పేరు కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తున్న నటీనటుల ప్రైవేటు ఫోటోలు.. వీడియోలు రేపుతున్న దుమారం, రచ్చ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ రన్ అవుతోంది. అయితే.. ఈ ఫోటోలతో తన భార్యకు ఏ మాత్రం సంబంధం లేదని.. ఆమె ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ పేర్కొన్నారు. సంభందం ఉందన్నా, లేదన్నా...లీక్ అవుతున్న ఫొటోలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.

సుచీ లీక్స్: తన అశ్లీల ఫోటోస్, వీడియోస్ చూసి హీరోయిన్ షాక్, స్పందన..!

ఈ 'సుచి లీక్స్' వ్యవహారం ఏ స్దాయికి వెళ్లిందంటే... సుచి పేరుతో ఎప్పుడు ఏ విషయం బయటికి వస్తుందా అని ఆసక్తిగా జనం, టెన్షన్ గా సినిమా జనం ఎదురు చూస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.... సుచిత్ర బయటపెట్టిన షాకింగ్ విషయాల్లో డైరెక్టర్ సెల్వ రాఘవన్ నుంచి సింగర్ కమ్ హీరోయిన్ ఆండ్రియాకు పంపిన ఒక ప్రైవేట్ మెయిల్ కూడా ఉంది.

సుచీ లీక్స్: మా ఆవిడ మానసిక స్థితి బాగోలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్!

ఆ మెయిల్ నిజమా..ఉత్తిదా...క్రియేట్ చేసిందా అన్నది చెప్పలేం కానీ.. ఆ మెయిల్ మధ్యలో ఒక చోట అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావనకు రావడం విశేషం.దాంతో ఈ విషయం తెలుగు నాట కూడా మాట్లాడుకునే స్దాయికి వెళ్లింది.

Singer Suchitra Leaked Sensational News About Allu Arjun

ఆ మెయిల్ లో ...తాను ఒక నవల ఆధారంగా ఒక అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేస్తున్నానని.. అల్లు అర్జున్ కోసం ఈ స్క్రిప్టు రెడీ చేస్తున్నానని.. వాల్ట్ డిస్నీ వాళ్లు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారని సెల్వ రాఘవన్ ఇందులో పేర్కొన్నాడు. వాల్ట్ డిస్నీ వాళ్లు సినిమా చేయడానికి ముందుకు రావడమంటే మామూలు విషయం కాదని.. ఈ స్క్రిప్టు చాలా బాగా వస్తోందని సెల్వ ఇందులో చెప్పాడు.

ఇక సెల్వ రాఘవన్ రాసారని చెప్పబడుతున్న ఈ మెయిల్లో మిగతా విషయాలన్నీ అర్థమయ్యీ కానట్లు ఉన్నాయి. నిన్ను నేను కోరుకున్న మాట వాస్తవమే.. కానీ అందుకోసం ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా అని సెల్వ ఇందులో పేర్కొన్నట్లుగా ఉంది. ఆండ్రియాతో వ్యక్తిగత విభేదాల గురించి.. కుటుంబ వ్యవహారాల గురించి ప్రస్తావన ఉండి చిచ్చు పెట్టేలా ఉంది. ఈ మెయిల్ నిజమే అయినట్లయితే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సెల్వ ప్రయత్నించడం కూడా వాస్తవమేనా?అనేది ఇప్పుడు అంతటా మాట్లాడుకునే విషయం అయ్యింది.

అలాగే ...సుచిత్ర అకౌంట్ నుంచి సంగీత దర్శకుడు అనిరుద్ - హీరోయిన్ ఆండ్రియా.. హీరో రానా - హీరోయిన్ త్రిష.. టీవీ నటిదివ్యదర్శిని ఒక యువకునితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు సుచిత్ర ట్విట్టర్ లో పోస్ట్ అయ్యాయి. ఈ ఫోటోలతో వారి రాసలీలలు అన్న ట్యాగ్ లైన్ తో పాటు.. వేరే వారికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయటం.. త్వరలో మరికొందరి తారల రాసలీలల్ని బయటపెట్టనున్న సందేశాన్ని పేర్కొనటంతో ఈ వ్యవహారం గురించే తమిళ, తెలుగు వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.

English summary
Singer Suchitra in her leaked information has revealed some interesting and sensational news about Allu Arjun.What is the leaked information about Allu Arjun Why it is sensational.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu