Suchi Leaks ఆ స్టార్ హీరో గే.. అందుకే భార్యతో విడాకులు.. మరోసారి సుచీలీక్స్ సంచలనం
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చీకటి బాగోతాలను బయటపెట్టిన సింగర్ సుచిత్ర అప్పట్లో సంచలనం రేపింది. ధనుష్, రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా జెర్మియా, అనిరుధ్ రవిచందర్ లాంటి ప్రముఖుల పార్టీ పోటోలు లీక్ చేసి సుచీ లీక్స్ అంటూ తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. అయితే తాజాగా మరోసారి తన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో కొందరు స్టార్ హీరోలపై ఆరోపణలు చేసింది. సుచిత్ర తాజా లీక్స్ గురించిని వివరాల్లోకి వెళితే..
తమిళంలో రేడియో జాకీ, గాయని సుచిత్ర 2017 సంవత్సరంలో సోషల్ మీడియాలో ధనుష్‌పై సంచలన కథనాలు వెల్లడించింది. తన అకౌంట్ హ్యాకింగ్ చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సినీ తారల రాసలీలల ఫోటోలు బయటపెట్టింది. దాంతో తమిళ సినిమా పరిశ్రమలో షేక్ అయిపోయింది.

అయితే తమిళ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. తనను బలవంతంగా కౌగిలిలో బంధించిన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని హీరో ధనుష్‌పై ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. త్రిషా, రానాకు ఉన్న సంబంధాలను, ఆండ్రియా జెర్మీయాకు ఉన్న ఇతర బంధాలను వెలుగులోకి తెచ్చింది.
అయితే తాజాగా సుచిత్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్యపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్ ఓ గే.. అర్దరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకొంటారు. స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చారు అని బాంబు పేల్చింది.

ఇక తమ దాంపత్య జీవితంలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు ఒకరిని ఒకరు చీట్ చేసుకొన్నారు. వివాహిక బంధంలో ఉండి వారు మరోకరితో అఫైర్, సంబంధాలు కొనసాగించారు. ధనుష్ గే, డ్రగ్స్‌కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొన్నది అని సుచిత్ర వెల్లడించింది.
ఇదిలా ఉండగా, సుచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదు. ఆమె కొన్ని మానసిక రుగ్మతలకు గురైంది. ఆమె చెప్పే విషయాలను సీరియస్‌గా తీసుకోవద్దని భర్త కార్తీక్ చెప్పాడు. అయితే సుచిత్ర చెప్పిన విషయాలపై ధనుష్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. సుచిత్రపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











