స్టూడియోలో బంధించి సింగర్‌పై అఘాయిత్యం.. వీడియో ఫుటేజీతో మ్యూజిక్ డైరెక్టర్ బ్లాక్‌మెయిల్

తమిళ సినీ పరిశ్రమలో మరోసారి తీవ్ర చర్చకు దారితీసిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయని స్వాగత కృష్ణన్ (Swagatha Krishnan) ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడని, చేసిన పనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడని తన బాధ చెప్పుకొంది. అంతేకాకుండా బ్లాక్‌మెయిల్ కూడా చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ సంఘటన వల్లే ఇండస్ట్రీని తాను వదిలేశానని, సదరు మ్యూజిక్ డైరెక్టర్‌ని 'ఎప్‌స్టీన్ ఆఫ్ మద్రాస్' అని పేరు పెట్టింది.

తాజాగా సింగర్ స్వాగత కృష్ణన్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన అనుభవాలను వెల్లడించారు. స్వాగత చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆమె వ్యక్తిగతంగా అత్యంత బలహీన దశలో ఉన్న సమయంలో జరిగిందని తెలుస్తోంది. తొమ్మిదేళ్ల ప్రేమ సంబంధం ముగిసిన తర్వాత తీవ్ర భావోద్వేగ ఆందోళనలో ఉన్న సమయంలో ఆ సంగీత దర్శకుడు తన జీవితంలోకి వచ్చాడని ఆమె తెలిపారు. 'ఆయన గురువులా నటిస్తూ నమ్మకం కలిగించాడు. నా పరిస్థితిని ఉపయోగించుకుని నాపై ప్రభావం చూపించాడు' అని ఆమె ఆరోపించారు. ఈ విశ్వాసాన్ని ఉపయోగించుకుని తనకు దగ్గరయ్యాడని ఆమె వాదించారు.

Singer Swagatha Krishnan Alleges Abuse Calls Tamil Composer Epstein of Madras

ఇంకా షాకింగ్‌గా, తనను స్టూడియోలోకి పిలిచి సౌండ్‌ప్రూఫ్ గదిలో బంధించి బలవంతంగా లైంగిక దాడి చేశాడని స్వాగత పేర్కొన్నారు. ఆ ఘటనను స్టూడియోలో ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్ చేసి, తరువాత అదే ఫుటేజ్‌తో బెదిరించి బ్లాక్‌మెయిల్ చేశాడని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా 'బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా, ఆ సంగీత దర్శకుడు తనతో కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ వంటి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించలేదని, పైగా అప్పుల్లో ఉన్నానని చెప్పి తన దగ్గరే డబ్బులు తీసుకుని మోసం చేశాడని స్వాగత ఆరోపించారు. అంతేకాదు.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలు కూడా మోపాడని ఆమె తెలిపారు. ఈ సంఘటనల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించారు.

ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తాను చెన్నైని విడిచి ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు వెళ్లి అక్కడ కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవల మరో యువతి కూడా ఇదే తరహా అనుభవాన్ని తనతో పంచుకోవడంతో ఇక మౌనం వహించకూడదని నిర్ణయించుకుని ఈ విషయాన్ని బయటపెట్టినట్లు స్వాగత తెలిపారు.

ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని "మద్రాస్ ఎప్స్టీన్"గా అభివర్ణించడం మరింత సంచలనంగా మారింది. ఇదే ప్యాటర్న్‌తో పలువురు మహిళలు బాధితులై ఉండొచ్చని ఆమె పేర్కొనడం ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రమైంది. 'నేనే కాదు, చాలామంది అమ్మాయిలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు'అని ఆమె అన్నారు. అయితే ఇంతటి ఆరోపణలు చేసినప్పటికీ, ఆ సంగీత దర్శకుడి పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.

ఇప్పటికే తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన సోదరి మాయ కృష్ణన్ సపోర్ట్‌తో న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్వాగత తెలిపారు. ఈ కేసులో అధికారిక ఫిర్యాదు, విచారణ వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కొందరు బాధితురాలికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు పూర్తి వివరాలు బయటపడాలని కోరుతున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X