Vani Jairam ది సహజ మరణమా? హత్యనా? కీలకంగా పోస్టుమార్టం రిపోర్ట్.. చెన్నై పోలీసులు ఏం చెప్పారంటే?
లెజెండరీ సింగర్ వాణి జయరాం మృతివార్త సంగీత, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. అయితే ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని హాడోవ్ రోడ్‌లోని నివాసంలో గత కొద్దికాలంగా వాణి జయరాం ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే ఆమె తలకు గాయమై మరణించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనుమానాల నేపథ్యంలో వాణి జయరాం మృతి వ్యవహారాన్ని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాల గురించి డీసీపీ శేఖర్ దేశ్‌ముఖ్ వెల్లడిస్తూ..
చెన్నై పోలీసులు తెలిపిన ప్రకారం.. 2018లో జయరాం మరణించినప్పటి నుంచి వాణి జయరాం ఒంటరిగా నివసిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పనిమనిషి వచ్చి ఇంటిలో పనులు ముగించి వెళ్తారు. అయితే ప్రతీ రోజు మాదిరిగానే పనిమనిషి వచ్చి బెల్ మోగించగా.. ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. వాణి జయరాం సోదరి ఉమాకు పనిమనిషి కాల్ చేశారు. దాంతో ఆమె వచ్చి డూప్లికేట్ తాళం చెవులతో డోర్ ఓపెన్ చేశారు. అయితే బెడ్ రూమ్‌లో వాణి జయరాం నుదుటికి గాయమై పడి ఉన్నారు. రక్త మడుగులో ఉన్న అప్పటికే అచేతనంగా పడి ఉండటంతో పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం పోలీసులు శవపరీక్ష కోసం వాణి జయరాం పార్థీవ దేహాన్ని కిల్‌పాక్ హాస్పిటల్‌కు తరలించారు అని చెప్పారు.

వాణి జయరాం తలకు గాయమై మరణించడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇంటిని నిశితంగా పరిశీలించారు. ఆమె మరణం సహజమా? హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా వాణి జయరాం మరణంపై తమిళనాడు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











