Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
దర్శకుడు పీఎస్ మిత్రన్.. అందరికీ గుర్తుండే ఉంటుంది. విశాల్ హీరోగా వచ్చిన ఇరుంబుదురై (అభిమన్యుడు) అనే చిత్రాన్ని తీసిన పీఎస్ మిత్రన్ అందర్నీ షాక్‌కు గురిచేశాడు. అద్భుతమైన కథ, కథనాలతో, సీటు అంచున కూర్చోబెట్టే బిగితో తెరకెక్కించన అభిమన్యుడు సినిమా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ ఘన విజయం సాధించింది. మరోసారి ఈ దర్శకుడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వచ్చేస్తున్నాడు.
మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌తో, ఫేక్ సర్టిఫికేట్ మాఫియాతో ఓ సూపర్ హీరో చేసే పోరాటమే ఈ మూవీ అని అర్థమవుతోంది.
పెద్దయ్యాక ఏం అవుతావవని స్కూల్లో అడిగితే.. శక్తిమాన్‌లా సూపర్ హీరో అవుతా అని ఓ కుర్రాడు చెప్పడం.. బిల్డింగ్ పై నుంచి ఆ చిన్న పిల్లాడు దూకడం లాంటి సీన్లతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మరి పూర్తి చిత్రాన్ని చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.
Here's the @Siva_Kartikeyan's #Hero Trailer 🎭
— Ramesh Bala (@rameshlaus) December 13, 2019
A Mass Entertainer with a Message is coming#HeroTrailer : https://t.co/wPrEFklf5A
@Psmithran @akarjunofficial @thisisysr @AbhayDeol @kalyanipriyan @george_dop @AntonyLRuben @kjr_studios @DoneChannel1 @gobeatroute @LahariMusic