twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజిటలైజేషన్: మళ్లీ గర్జించనున్న సూపర్ స్టార్

    By Srikanya
    |

    చెన్నై : అలనాటి అగ్ర నటుడు, 'నడిగర్‌ తిలకం' శివాజీ గణేశన్‌ నటించి గత 1959లో విడుదలైన 'వీరపాండ్య కట్టబొమ్మన్‌' చిత్రం డిజిటలైజ్‌ చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఎలా శ్రమించారో ఈ చిత్రం చూస్తే చాలు అర్థమైపోతుందంటారు పెద్దలు. అందులోనూ వీరపాండ్య కట్టబొమ్మన్‌ అంటే ఎవరో కూడా తెలియని ఎంతో మంది ఈ చిత్రం చూసి ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నారు.

    నటుడు శివాజీ గణేశన్‌ ఆయన పాత్ర పోషించి యావత్‌ ప్రపంచానికి వీరపాండ్య కట్టబొమ్మన్‌ను మరువలేని విధంగా చేశారు. ఆయన డైలాగులు చెప్పి గర్జించడం, చావు అంటే తనకు భయం లేదంటూ ఉరి తాడుకు ముద్దుపెట్టడం, బ్రిటీషువారిని వెళ్లగొట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు... వంటి సన్నివేశాలు తమిళులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    Sivaji Ganesan continues to rule

    ఆ చిత్రంలోని డైలాగులను పాఠశాలల్లో విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలకు ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో చిత్రాలు తెరపైకి వచ్చినా కొన్ని మాత్రం శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఆ కోవలో ఈ సినిమాకు ఇప్పటికీ స్థానం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం డిజిటలైజ్‌ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    Sivaji Ganesan continues to rule

    English summary
    Even after a decade from his death, it is still the 'Nadigar Thilagam' who revives and rules the box office.'Veerapandiya Kattabomman' movie is under digitization is expected to hit the screens this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X