హీరోగా శివకార్తీకేయన్ ఫస్ట్‌లుక్.. మిస్టర్టీ మ్యాన్‌గా అంచనాలు పెంచి..
తమిళ సినీ రంగంలో సెన్సేషనల్ యాక్టర్ శివకార్తీకేయన్ తాజాగా హీరో అనే సినిమా టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అభిమన్యుడు దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.
హీరో ఫస్ట్ లుక్ చూడగానే శివ కార్తీకేయన్ సూపర్ హీరో క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడనే అనుమానం కలిగింది. చేతిలో మాస్క్ పెట్టుకొని మిస్టరీ మ్యాన్‌గా కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి లేపింది. ఫస్ట్‌లుక్‌లో ఎత్తైన బిల్డింగ్స్, పారా చూట్ లాంటి అంశాలు కనిపించడంతో ఇది మరో క్రిష్ లాంటి సినిమా అనే ఫీలింగ్‌ను రేపింది.

హీరో చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ తమిళ చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ నిర్మించింది.
హీరో చిత్రానికి ముందు మిస్టర్ లోకల్ అనే చిత్రంలో నటించాడు. ఎం రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దాంతో శివకార్తీకేయన్ జాగ్రత్త పడ్డాడనే మాటలు వినిపించాయి. తను కూడా తాను జాగ్రత్తగా స్క్రిప్టులను ఎంచుకొంటానని చెప్పిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











