టాలీవుడ్ కు శివకార్తీకేయన్ షాక్.. 70 కోట్లు అడగటంతో రచ్చ
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ కు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ మంచి పేరు ఉంది. తమిళ ఇండస్ట్రీలో గ్రౌండ్ నుంచి ఎదిగిన హీరోగా ఆయనకు పేరుంది. అంతేకాకుండా గుడ్ మ్యానర్, విమర్శలకు దూరంగా ఉండే తత్వం, పెద్దలను గౌరవించే లక్షణాలతో తమిళ తంబీల మనస్సు గెలుచుకున్నాడు. ఆర్జేగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన జీవితం ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టింది. శివకార్తీకేయన్ కు కూడా తన సినిమాలకు ఎంగానో కష్టపడుతూ ఉంటారు. స్టోరీ సెలక్షన్, డైరెక్ట్స్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుంటూ సినిమా సినిమాకు ఎదుగుతూ వస్తున్నారు.
శివకార్తీకేయన్ నటించిన తమిళ చిత్రాలు తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ అవ్వడంతో ఆయనకు ఇక్కడా అభిమానులు ఏర్పడ్డారు. 2016లో వచ్చిన రెమో చిత్రంతో తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత హీర్, డాక్టర్, డాన్, ప్రిన్స్, మావీరన్, అయలాన్, అమరాన్ వంటి చిత్రాలతో తెలుగు డబ్డ్ వెర్షన్ తో అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు శివకార్తీకేయన్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు. అయితే త్వరలో శివకార్తీకేయన్ తెలుగు సినిమా చేయబోతున్నారంటూ ఇటీవల ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు జోరుగా నడిచాయి.

అది కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి శివకార్తీకేయన్ సినిమా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే దళపతి విజయ్, ధనుష్, రీసెంట్ గా అజిత్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివకార్తీకేయన్ కూడా తెలుగులో సినిమా చేయబోతుండటం, పైగా మాటల మాంత్రికుడు టాప్ హీరోలను డీల్ చేసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాంబినేషన్ సెట్ అయ్యిందనడంతో ఆ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అయ్యింది.
కాగా, ఈలోగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు శివకార్తీకేయన్ ఏకంగా రూ.70 కోట్ల రెమ్యునరేషన్ అడిగారంట. అయితే శివకార్తీకేయన్ తమిళంలో ఒక్కో సినిమాకు రూ.30 నుంచి రూ.35 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. కానీ తెలుగు సినిమాకు మాత్రం రెండింతలు పెంచి పారితోషికాన్ని అడిగారంట. ఈ విషయాన్ని త్రివిక్రమే చెప్పడంతో న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వ్యాప్తి చెందుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో రెమ్యునరేషన్ టాపిక్ ముందుగా రావడంతో మరీ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.
మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే అనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ తమిళ దర్శకుడు అట్లీకి AA22ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో త్రివిక్రమ్ కు గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే శివకార్తీకేయన్ తో సినిమా చేయాలని భావించారంట. మరోవైపు వెంకటేశ్ దగ్గుబాటితోనూ టాక్స్ జరుగుతున్నట్టు టాక్. ఇక శివకార్తీకేయన్ తమిళంలో రూపు దిద్దు కుంటున్న మదరసై, పరాశక్తి, వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఎస్కే26 చిత్రం కూడా అనౌన్స్ మెంట్ కు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











