Ayalaan ఏలియన్‌గా శివకార్తీకేయన్.. ఐదు భాషల్లో పాన్ ఇండియాగా.. వరల్డ్‌వైడ్ రిలీజ్ ఎప్పుడంటే?

దక్షిణాదిలో విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో రాణిస్తున్న యువ హీరో శివ కార్తీకేయన్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై 24ఏఎమ్ అధినేత ఆర్డీ రాజా నిర్మాణంలో ఆయలాన్ సినిమాకు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజేఆర్ స్టూడియోస్ అధినేత కోటపడి జే రాజేష్ ఈ సినిమా 2023 సంవత్సరంలో దీపావళీ కానుకగా రిలీజ్ అవుతున్నదని ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఐదు భాషల్లో అయలాన్ : కేజీ ష్టూడియోస్ అధినేత కేజే రాజేష్ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ఆయలాన్ సినిమా గురించిన విశేషాలు వెల్లడించారు. ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో దీవాళీకి విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను మనసు, హృదయం పెట్టి కష్టపడి తీశాం. ఈ సినిమాను దీపావళీకి రిలీజ్ చేస్తున్నామని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాం అని అన్నారు.

Sivakarthikeyan

హయ్యెస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో : ఆయాలన్ మేకింగ్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాలో హయ్యెస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటిగ్రేషన్‌తో చేయబోతున్నాం. మాకు సరైన సమయం ఉంది కాబట్టి.. మేము ఫర్‌ఫెక్ట్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతున్నాం అని కే జే రాజేష్ అన్నారు.

4500 పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయాలన్ చిత్రం తొలి ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ చిత్రం. 4500 పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. ఏలియన్ క్యారెక్టర్‌ కథాంశంగా ఉండటంతో రిచ్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమాను అత్యాధునిక సాంకేతికతతో వర్క్ చేస్తున్న ఫాంటామ్ ఎఫ్ఎక్స్ థ్యాంక్స్ చెబుతున్నాం అని కే జే రాజేష్ అన్నారు.

Sivakarthikeyan

ఫ్యాన్స్‌కు పండగలాంటి చిత్రం : అయలాన్ చిత్రం విషయానికి వస్తే.. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సీజీ వర్క్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఎంతో వేచి చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం ఉంటుంది అని కే జే రాజేష్ తెలిపారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
శివ కార్తీకేయన్, రకుల్ ప్రీత్ సింగ్, కరుణాకరన్, యోగిబాబు, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, బాలశరవణన్ తదితరులు
రచన, దర్శకత్వం: ఆర్ రవికుమార్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
ఎడిటింగ్: రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: టీ మధురాజ్
వీఎఫ్ఎఖ్స్: బిజోయ్ ఆర్పుథరాజ్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్
క్యాస్టూమ్ డిజైన్: పల్లవి సింగ్, నీరజ కోన
లిరిక్: వివేక్, మధన్ కార్కీ
నిర్మాత: ఆర్డీ రాజా
బ్యానర్: 24 ఏఎమ్ స్టూడియోస్
డిస్ట్రిబ్యూషన్: కేజేఆర్ స్టూడియోస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X