మెడికల్ మాఫియాపై వేలైక్కరన్.. 22న రిలీజ్‌కు సిద్ధం
తని ఒరువన్ చిత్రం తర్వాత సామాజిక అంశంతో డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్న చిత్రం వేలైక్కరన్. వైద్యరంగంలో చోటుచేసుకొంటున్న లోపాలు, వైద్య వృత్తిలో మాఫియా అంశాల ఆధారంగా రూపొందిన వేలైక్కరన్ చిత్రంపై తమిళ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వేలైక్కరన్ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్‌కు సిద్ధమైంది. నయనతార, స్నేహ, ప్రకాశ్ రాజ్, ఆర్జే బాలాజీ, సతీష్, రోహిణి తదితరలు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రాన్ని 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా నిర్మించారు.
వేలైక్కరన్ చిత్రం రిలీజ్‌ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ మూడు వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియో ట్రైలర్లకు అనూహ్య స్పందన వస్తున్నది. ఆ వీడియోను మీరే చూడండి..


Click it and Unblock the Notifications











