వేలైక్కరన్ వీడియోలు ట్రెండింగ్.. శివకార్తీకేయన్‌కు అనూహ్య స్పందన
మెడికల్ మాఫియా, అవినీతి, ఆహార కల్తీ లాంటి సామాజిక అంశాలతో డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్న చిత్రం వేలైక్కరన్. ఫిలిం సర్టిఫికెట్ కోసం ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా ఎలాంటి కట్ లేకుండా యూ సర్టిఫికెట్‌ను జారీ చేయడం విశేషం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వేలైక్కరన్ చిత్రంలో నయనతార, స్నేహ, ప్రకాశ్ రాజ్, ఆర్జే బాలాజీ, సతీష్, రోహిణి తదితరలు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రాన్ని 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా నిర్మించారు.
వేలైక్కరన్ చిత్రం రిలీజ్‌ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ మూడు వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియో ట్రైలర్లకు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తున్నది. ఆ వీడియోను మీరే చూడండి.


Click it and Unblock the Notifications











