తెలుగు మార్కెట్ పై పట్టు సాదిస్తున్న శివ కార్తికేయన్.. అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..

తమిళ చిత్ర పరిశ్రమలో ఏ సినిమా హిట్ అయినా సరే చాలావరకు అవి తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పటికే కొంతమంది కోలీవుడ్ హీరోలు తెలుగులో ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే తమిళ హీరోలు ప్రతి సారి కూడా కంటిన్యూగా సక్సెస్ అవ్వడం లేదు. ఒకప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నార ఆ తరువాత విక్రమ్ సూర్య కార్తీ వంటి వాళ్లు కూడా ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ వచ్చారు. ముఖ్యంగా సూర్య సినిమాలు అయితే తెలుగులో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంటూ వస్తున్నాయి.

అయితే గత కొంత కాలంగా తమిళ సీనియర్ హీరోలు తెలుగు మార్కెట్ పై అంతగా పట్టు సాధించడం లేదు. వారి తర్వాత ఇప్పుడు ఎక్కువగా విజయ్ వంటి వారు ఫోకస్ పెడుతుండటం విశేషం. విజయ్ మాస్టర్ సినిమా తెలుగులో తొలిసారి అత్యధిక వసూళ్లను అందుకుని అతని భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలను పెంచేసింది. అంతేకాకుండా డైరెక్ట్ గా ద్విభాషా చిత్రాన్ని చేయడానికి కూడా ఈ హీరో సిద్ధం అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక విజయ తర్వాత ధనుష్ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ కూడా మెల్లగా తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టడం విశేషం.

ఇటీవల విడుదలైన డాక్టర్ సినిమా తెలుగులోకి అనువాదం అవ్వగా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. తెలుగులో ఈ సినిమా కోటికి పైగా వసూళ్లను అందుకోవడం విశేషం. నిజంగా శివకార్తికేయన్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ సక్సెస్ తో భవిష్యత్తులో కూడా తన సినిమాలను డైరెక్టుగా తెలుగులో భారీగా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పటికే ఒక ద్విభాషా చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాడు.అందరి ఫోకస్ మాత్రం ఆ సినిమాపైనే ఉంది.

Sivakarthikeyan special focus on upcoming bilingual project

ఎందుకంటే ఆ సినిమాను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఒక డిఫరెంట్ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను కూడా స్వప్న సినిమా లోనే నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అయితే శివకార్తికేయన్ కు సౌత్ ఇండస్ట్రీ లో ఒక మంచి మార్కెట్ సెట్ అవుతుందని చెప్పవచ్చు.

మరి ఆ టాలెంటెడ్ హీరో ఈ అవకాశాన్ని ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. అలాగే శివకార్తికేయన్ కు తెలుగులో కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అతను ఈ కీలక సమయంలో ఏ మాత్రం టెంప్ట్ అవ్వకుండా మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మొత్తానికి అనుదీప్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తమిళంలో కూడా మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X