సూర్య, కార్తి... తండ్రి శివకుమార్ చేసిన పనికి అంతా షాక్ (వీడియో)
సూర్య, కార్తి తండ్రి... ప్రముఖ తమిళ నటుడు శివ కుమార్ ఇటీవల ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభిమాని పట్ల రూడ్‌గా ప్రవర్తించడం అందరూ షాకయ్యేలా చేసింది. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన అభిమాని ఫోన్ ఆయన నేలకేసి కొట్టారు.
ఇటీవల మదురైలో ఫెర్టిలిటీ సెంటర్ ఓపెనింగుకు శివ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివ కుమార్‌తో పాటు మినిస్టర్ ఆర్‌బి ఉదయ్ కుమార్ సైతం చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తుండటం చూసి ఆయన ఆగ్రహానికి గురయ్యారు.
శివ కుమార్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అభిమాని ఒక పక్కన నిల్చుని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరిస్తుంటే మరీ ఇంత దురుసుగా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

శివకుమార్ తాను చేసిన పనికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నవారూ లేకపోలేదు. మరికొందరేమో శివ కుమార్‌కు ఈ కోపం పోవాలంటే యోగా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











