సైజ్ జీరో ఫిగర్ శ్రియా
సినీ హీరోయిన్లందరికీ కరీనా కపూర్ రోల్ మోడల్ అయిపోయింది. నటి శ్రియాకు కూడా ఆమెనే రోల్ మోడల్ అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ లేదు. శ్రియా సైజ్ జీరో ఫిగర్ ను కొని తెచ్చుకుంది. దీంతో శ్రియా రూపురేఖలే మారిపోయాయట. చూచు వారలకు చూడ ముచ్చటగా ఉందట. నిజానికి, శ్రియా మొదటి నుంచి బక్కపలుచగానే ఉంటుంది. ఇప్పుడు మరింత బరువు తగ్గిపోయి చూపరులను కట్టి పడేస్తోందని అంటున్నారు. శ్రియా 8 ఏళ్లుగా సినీ రంగంలో ఉంటోంది. దీంతో మేకోవర్ అవసరమైందని చెబుతున్నారు. దానివల్లనే ఆమె కొత్తగా సెక్సీగా కనిపించడానికి సైజ్ జీరో బాడీని సంతరించుకుందని అంటున్నారు. తన కొత్త అందాలను శ్రియా విశాల్ హీరోగా నటిస్తున్న పిస్టాలో ఆరబోస్తోంది. ఆ తర్వాత కరీనాలాగే బిక్నీలో నటిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది.
shriya zero size vishal kareena kapoor pista role model bikini కరీనా కపూర్ రోల్ మోడల్ శ్రియా సైజ్ జీరో


Click it and Unblock the Notifications