twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హోటల్‌లో పనిచేశా.. ఆకలితో అలమటించా.. పవన్, మహేశ్ సూపర్.. ఎస్‌జే సూర్య

    దర్శకుడు ఎస్ జే సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఖుషీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన చిత్ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మహేశ్‌బాబుతో నాని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో తీసిన

    By Rajababu
    |

    Recommended Video

    SJ Surya Revealed Few Things About His Life గతిలేక హోటల్‌లో పనిచేశా..

    దర్శకుడు ఎస్ జే సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఖుషీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన చిత్ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మహేశ్‌బాబుతో నాని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో తీసిన కొమురం పులి చిత్రాలు నిరాశను మిగిల్చాయి. దాంతో కొంత కాలం తెలుగు సినిమాకు దూరమయ్యాడు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో భైరవ పాత్రతో ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ పాత్రకు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ జే సూర్య ప్రముఖ దినపత్రికతో మాట్లాడారు. ఎస్ జే సూర్య వెల్లడించిన ఆయన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు ఇవే.

    శివాజీ గణేషన్ కలువాలని

    శివాజీ గణేషన్ కలువాలని

    నా సొంత ఊరు తమిళనాడులోని తిరునెల్వేలిలోని శంకరన్ కోవిల్. మా ఇంట్లో అందరు విద్యాధికులే. మా కుటుంబంలో ఎక్కువ మంది టీచర్లు, ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ధ్యాస ఉండటంతో చదువు అబ్బలేదు. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చదువుతున్న రోజుల్లో శివాజీ గణేషన్ కలిసి నా గురించి చెబితే హీరోను చేస్తారనే నమ్మకంతో చెన్నైకి వెళ్లాను.

    జూనియర్ ఆర్టిస్టుగా చేరా

    జూనియర్ ఆర్టిస్టుగా చేరా

    చెన్నైకి వెళ్లిన తర్వాత సినిమా అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డాను. ఎవరిని కలువాలో తెలియదు. అనేక ప్రయత్నాల తర్వాత జూనియర్ ఆర్టిస్టుగా చేరాను. నాలుగు రోజులు షూటింగ్ ఉంటే, నెల రోజుల ఖాళీగా ఉండేవాడిని. ఆకలితో అలమటించే వాడిని. చేతిలో డబ్బులు ఉండేవి కాదు. ఇంటి అద్దె కట్టడానికి కష్టమయ్యేది. ఇంట్లో డబ్బులు అడగాలంటే మొహమాటం అడ్డువచ్చేది.

    హోటల్‌లో సర్వర్‌గా చేరా

    హోటల్‌లో సర్వర్‌గా చేరా

    సినిమా అవకాశాలు వచ్చే వరకు ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఓ హోటల్‌లో సర్వర్‌గా చేరాను. హోటల్ టేబుల్స్ తుడిచే వాడిని. వచ్చే డబ్బుతో ఆకలి కష్టాలు తీరాయి. అదే సమయంలో లయోలా కళాశాలలో డిగ్రీలో చేరాను. ఆ సమయంలోనే నటనకు దూరమైపోతున్నానే ఆందోలళన మొదలైంది. అప్పుడు దర్శకత్వశాఖలో చేరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను. ప్రముఖ దర్శకుల వద్ద పనిచేయాలని ప్రయత్నించానే. వారి లగేజీలు మోసాను. కానీ నా కల నెరవేరలేదు.

    వసంత్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా

    వసంత్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా

    చెన్నైలో అనేక కష్టాలపడిన తర్వాత 1995లో ‘ఆశై' చిత్రంలో వసంత్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం దక్కింది. అందులో అజిత్‌ హీరో. చిరిగిన చొక్కా, పిన్నులతో కుట్టిన చెప్పులు... అప్పట్లో నా పరిస్థితి. ఆ సెట్‌లోనే అజిత్‌ నన్ను చూశారు. ‘ఇతడెవరో చాలా కష్టపడి పనిచేస్తున్నాడే. నేను హీరోగా స్థిరపడ్డాక తప్పకుండా ఓ అవకాశం ఇవ్వాలి' అనుకున్నారట.

    అజిత్ తొలి అవకాశం

    అజిత్ తొలి అవకాశం

    దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత అజిత్‌ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడే అజిత్‌కు వాలి చిత్ర కథ చెప్పాను. కథ నచ్చడంతో అజిత్ ఒకే చెప్పాడు. సిమ్రాన్ హీరోయిన్. అయితే ఆర్థిక కారణాల వల్ల సినిమా షూటింగ్ సరిగా కొనసాగించలేకపోయాం. పది రోజులు షూటింగ్ జరిగితే మరో పది రోజులు బ్రేక్. ఎలాగోలా సినిమా పూర్తయింది. ఆ సినిమా ఓర్పు, సహనాన్ని నేర్పింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌ కావడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.

    ఖుషీ కథకు పవన్ గ్రీన్ సిగ్నల్

    ఖుషీ కథకు పవన్ గ్రీన్ సిగ్నల్

    ఆ తర్వాత తమిళంలో ఖుషీ చేశాం. అప్పుడు నిర్మాత ఏఎం రత్నం తెలుగులో చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ బద్రీ సినిమా చేస్తున్నాడు. కథ విన్న తర్వాత పవన్ ఒకే చెప్పాడు. తమిళంలో ఖుషీ రిలీజై మోస్తారుగా ఆడింది. అయితే తమిళ టాక్ విన్న తర్వాత పవన్ ఏమాత్రం వెనుకడగు వేయలేదు. ఆ తర్వాత ఖుషీ తెలుగులో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.

    మహేష్‌బాబు హీరోగా నాని

    మహేష్‌బాబు హీరోగా నాని

    ఆ తర్వాత తెలుగులో మహేష్‌బాబు హీరోగా నాని సినిమాను తెరకెక్కించా. ఒక్కడు లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాని రావడంతో మహేష్‌ని అలాంటి కథలో తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. కానీ మహేష్‌తో సినిమా చేయడం మాత్రం మర్చిపోలేని అనుభవం. అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఈ సినిమాకే వెచ్చించా. ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే మళ్లీ హోటల్లో టేబుళ్లు తుడవడానికైనా రెడీ అనుకునే ఆ ప్రాజెక్టులో దిగాను.

    భైరవ పాత్ర సంతృప్తి

    భైరవ పాత్ర సంతృప్తి

    మహేశ్ బాబు సినిమా తీయడానికి సిద్ధమైన మురుగదాస్‌ నాకు స్పైడర్‌ కథ చెప్పారు. వాలి సినిమా చేసేటప్పుడే మురుగదాస్‌తో పరిచయముంది. అన్ని సంవత్సరాల తర్వాత ‘స్పైడర్‌'లో భైరవు పాత్రని నాకు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. సినిమా రిలీజయ్యాకా అంతే మంచి స్పందన వచ్చింది. అలాంటి పాత్ర కోసమే నా కెరీర్‌లో ఇన్ని రోజులు ఎదురుచూశాను. నటుడిగా ఆ పాత్ర సంతృప్తినిచ్చింది.

    అజిత్‌ లేకుంటే

    అజిత్‌ లేకుంటే

    హీరో అజిత్‌ లేకుంటే నాకు కెరీరే లేదు. నా సినీ జీవితం ఆయన పెట్టిన భిక్ష. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. తన పని మాత్రమే చూసుకుంటూ తన చుట్టూ ఉన్నవారి సంతోషం కోసం కృషిచేస్తారు. బస్సులో వెళ్లే నాకు వాలి తర్వాత ఓ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

    మహేష్‌బాబు సినిమా కోసం

    మహేష్‌బాబు సినిమా కోసం

    మహేష్‌బాబు సినిమా కోసం చాలా కష్టపడతారు. దర్శకుల మాట తప్పకుండా పాటించే కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. నాని సినిమా షూటింగ్‌లో ఆయనతో తొలిసారి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనలోని మంచితనం ఏమాత్రం తగ్గలేదు

    పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన వ్యక్తి

    పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన వ్యక్తి

    పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన వ్యక్తి. కొందరు హీరోలకు సినిమాల పరంగా అభిమానులు ఉంటారు. కానీ పవన్‌కు సినిమాకు అతీతంగా అభిమానించేవారున్నారు. అభిమానులనేకంటే అనుచరులు అనొచ్చు. ఇందుకు ఆయన మంచితనం, ముక్కుసూటితనమే కారణం. మహేష్‌, పవన్‌లతో సినిమా గెలుపోటములకు సంబంధంలేని స్నేహబంధం ఉంది.

    English summary
    SJ Surya was the director in intial days of his film career. He made Vaali with Ajith, Khushi with Pawan Kalyan. Recently He potrayed villain role in Spyder. He gets huge response to his role Bhirava in Spyder. In this occasion, He spoke to media, revealed few things in his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X