సంగీత దర్శకుడుగా మారిన పవన్ డైరక్టర్
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఎస్.జె సూర్య 2004 లోనే ప్రకటించారు. కానీ ఇన్నాళ్ళకు కార్య రూపం దాల్చింది. ఇందులో సూర్య నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ,సంగీతం అందించటం విశేషం. ఎ.ఆర్.రహమాన్ స్పూర్తితో తాను ఈ కాన్పిడెన్స్ తెచ్చుకుని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయమై సూర్య మీడియాతో మాట్లాడుతూ... పవన్ తో చేసిన పులి మ్యూజిక్ కంపోజింగ్ సమయంలో..రహమాన్ సార్... నీ సినిమాలకు నువ్వే మ్యూజిక్ కంపోజ్ చేసుకోగలవు అన్నారు. నేను ఆయన్ని మీరు జోక్ చేస్తున్నారా అని అడిగాను. దానికి రహమాన్ రిప్లై ఇస్తూ.. నేను ఆలా నీ మీద జోక్స్ చేయను. నిజంగా నీలో సంగీతం చేసుకోగల సామర్ధ్యం ఉంది అన్నారు. ఆ మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి అన్నారు.
ఈ చిత్రం కోసం ఖుషీ దర్శకుడు ఐదు నెలలు పాటు గిటార్, పియానో నేర్చుకున్నారు. ఇళయరాజాకి, రహమాన్, హరీష్ జయరాజ్ లతో పనిచేసిన ఐదుగురు సంగీత సహాయకుల సహకారంతో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసినట్లు తెలిపారు. రోజూ నేను ఐదు గంటలు పాట గిటార్ క్లాస్ లు, మరో ఐదు గంటలు పాటు పియోనో క్లాస్ లకు హాజరయ్యాను అన్నారు.
ఈ చిత్రం కథ గురించి చెపుతూ... ఇందులో నేను మ్యూజిక్ డైరక్టర్ గా కనిపిస్తాను. ప్రకాష్ రాజ్ ఆల్రెడీ సెటిలైన మ్యూజిక్ డైరక్టర్ గా కనిపిస్తారు. సిని పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం కనిపిస్తుంది అన్నారు. కొత్త నీరు రావటంతో పాత నీరు తగ్గిపోతుంది. అలాగే ఈ కథలో నేను మ్యూజిక్ డైరక్టర్ గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటంతో అప్పటికే సెటిలైన ప్రకాష్ రాజ్ కి డిమాండ్ తగ్గిపోతుంది. దాంతో ఆయన నన్ను ఇబ్బందులు పాలు చేస్తాడు.. ఆ తర్వాత కథ ఏం మలుపులు తిరగుతుందనేది ఆసక్తిగా ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications












