ఖుషి 2 ప్రియాంక కాంట్రవర్సీ.. విజయ్ ఫ్యాన్స్ కి ఎస్ జె సూర్య షాక్
ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి కొందరు యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. ఎలాంటి స్కిన్ షో లేకుండా కేవలం తమ లుక్స్ తోనే సోషల్ మీడియాలో యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్ అరుదుగా కనిపిస్తారు. ఇక ఇలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ కాంట్రవర్సీ లలో కూడా కనిపిస్తారు.
కానీ ఈ కోవకి చెందిన ఓ హీరోయిన్ తాను ఏ భాష నుంచి అయితే వచ్చిందో అదే ఇండస్ట్రీ హీరో అభిమానుల నుంచి ఈ కొన్ని రోజుల్లోనే విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకున్నది మాత్రం ప్రియాంక మోహన్ అని చెప్పాలి. తెలుగు చేసింది కేవలం రెండే సినిమాలు అయినప్పటికీ మన దగ్గర మంచి ఫేమ్ నే ఈమెకి ఉంది. కాగా ఆ రెండో సినిమా "సరిపోదా శనివారం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్సే పెద్ద దుమారాన్ని రేపాయి.

ఈమె ఈ సినిమా నటుడు ఎస్ జె సూర్యతో ఒకవేళ ఖుషి 2 కానీ చేస్తే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే చెయ్యాలి అని చెప్పడం తెలుగు ఆడియెన్స్ కి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఓ రేంజ్ కిక్ ఇస్తే.. తమిళ్ ఆడియెన్స్, అక్కడ ఖుషి హీరో విజయ్ అభిమానులు మాత్రం ప్రియాంక కామెంట్స్ తో ఆమెపై రగిలిపోయారు. తెలుగులో అవకాశాల కోసం ఇంతలా దిగజారిపోవాలా? చీప్ ప్రియాంక మోహన్ అంటూ కామెంట్స్ చేసారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో రెండు ఖుషి సినిమాలు తెరకెక్కించిన ఖుషి దర్శకుడే క్లారిటీ ఇవ్వడం హైలైట్ గా మారింది. ఇదే ప్రియాంక మోహన్ ఎస్ జె సూర్యని ఖుషి 2 పవన్ కళ్యాణ్ తో చేస్తారా వేరే హీరోతో చేస్తారా అని అడిగిన ప్రశ్నకి ఎస్ జె సూర్య సమాధానం ఇచ్చాడు. ఆ సినిమా కథ పవన్ కళ్యాణ్ గారికే రాసుకున్నాను అని ఆయనకే మొదటగా చెప్తే చాలా బాగా ఎంజాయ్ చేసారని చేద్దామన్నారు.
కానీ కొన్నాళ్ల తర్వాత లవ్ స్టోరీస్ సెట్ కావు అని.. తనని లవ్ చేసే కుర్రాడిలా ఇక చూసుకోలేను ఆ స్టేజి దాటేసాను సూర్య అంటూ నో చెప్పేశారని అదే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది.. ఈ సినిమా కళ్యాణ్ గారికి పడుంటే చాలా బాగుండేది అని తన మొదటి ఛాయిస్ ఆ సినిమాకి పవన్ కళ్యాణే అంటూ అసలు విషయాన్ని చెప్పాడు.
అయితే దీని తర్వాత ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకపోతే నాని, రామ్ చరణ్, విజయ్ లకి సూట్ అవుతుంది అని తెలిపాడు. సో ఇక్కడ పవన్ తర్వాత విజయ్ కి సూట్ అవుతుంది అని అసలు ట్విస్ట్ ఇచ్చాడు. సో అసలు ఖుషి 2 అనే సినిమా మొదటిగా అనుకున్నదే పవన్ కళ్యాణ్ తో అని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికైనా గ్రహిస్తారో లేదో చూడాలి మరి. అలాగే ప్రియాంకపై చేసిన కామెంట్స్ ని కూడా వెనక్కి తీసుకోవాలి మరి.


Click it and Unblock the Notifications











