షాకింగ్ :జయలలిత బుగ్గపై ఈ రంధ్రాలు, దేహం కుళ్లకుండా సూది వేశారా? మరేమైనా?
‘అమ్మ బుగ్గపై ఆ రంధ్రాలేంటీ’? అంటూ ఈ సోషల్ మీడియాలో ఈ ప్రశ్న జోరుగా చక్కర్లు కొడుతోంది.
చెన్నై: ఇక్కడ క్రింద మీరు చూస్తున్న ఫొటోతో పాటు... 'అమ్మ బుగ్గపై ఆ రంధ్రాలేంటీ'? అంటూ ఈ సోషల్ మీడియాలో ఈ ప్రశ్న జోరుగా చక్కర్లు కొడుతోంది. జయలలిత మరణించిన తరువాత ఆమె భౌతిక కాయాన్ని ఎంతో మంది తిలకించారు. అయితే ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఆసక్తి రేపాయి.
చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగా ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహం కొన్ని రోజుల పాటు పాడవకుండా, కుళ్లి పోకుండా ఉండేలా వైద్యులు 'ఎమాల్మింగ్' చేస్తుంటారు.
దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు, బాడీలోకి దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపే ప్రక్రియ ఇది. అయితే సహజంగా ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు.

జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి. జయలలితకు గుండె పోటు వచ్చినప్పటి నుంచి ఆమె మరణించే సమయం వరకూ వైద్యులు 'ఎక్మో' చికిత్స చేశారు. ఆ ప్రక్రియలోనే ఎమాల్మింగ్ కూడా నిర్వహించవచ్చు.
ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే వీటికి భిన్నంగా జయ బుగ్గలపై ఇలా నాలుగు రంధ్రాలు కనిపిస్తుండటంతో అది 'ఎమాల్మింగ్' సూదితో ఏర్పడిన రంధ్రాలా.. లేదా ఇతర చికిత్సలు చేయడానికి వీలుగా చేసిన రంధ్రాలా అని చర్చ జోరుగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











