నిర్మాత లైంగిక వేధింపులకు నటి కేసు
తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని నటి నిషాయాదవ్ చేసిన ఫిర్యాదుమేరకు ఆనంద్ రాంనాథ్ అనే నిర్మాతపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తనకు అండర్ వరల్డ్ ముఠాలతో సంబంధాలున్నాయంటూ బెదిరిస్తున్నాడని, తరచూ ఫోన్ చేస్తూ వేదిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఓ స్నేహితుడిద్వారా పబ్‌లో పరిచయమైన రాంనాథ్ చెన్నైకి చెందిన నిర్మాతని చెప్పుకున్నట్లు తెలిపింది. ఇక నిషా యాదవ్ ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ సినిమాలేం చెయ్యలేదు. ఈ నిర్మాత తాను అలాంటి వాడ్ని కాదని, ఆమె కావాలని తనని బ్లాక్ మెయిల్ చెయటానికే ఈ కేసు పెట్టిందని ప్తున్నాడు.
సినిమా పరిశ్రమలో సెక్సవల్ ఫేవర్స్ చాలా కామన్ అని సిని పెద్దలు ఈ నేపధ్యంలో చెప్తున్నారు. అయితే ఎవరూ మీడియాతో ఈ మాట అనటానికి ముందుకు రారని పోలీసులు అంటున్నారు. ఇక నిషా యాదవ్ తను ఎన్నో ఆసలతో సినీ పరిశ్రమకు వచ్చానని ఇలాంటి పరిణామాలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదని అంటోంది. ఇదంతా ఏదో సినిమాలో కథలా అనిపిస్తోందని, తను ఇక్కడ ఇలాంటివి జరుగుతాయని విన్నాను కానీ నిజ జీవితంలో ఎదుట పడతాయని ఊహించలేదంటోంది. స్నేహితుడుగా ఉన్న ఈ వ్యక్తి ఇలాంటి సెక్స్ వల్ బ్లాక్ మెయిల్ కి దిగుతాడని భావించలేదని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











