ఈ జూన్‌లోనే వివాహం: స్నేహ

By Srikanya

మొత్తానికి స్నేహ తన పెళ్లి విషయం మీడియాకు తెలియచేసింది. తమిళ హీరో ప్రసన్నను జూన్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు స్నేహ తమిళ మీడియాకు తెలియచేసారు. గత కొద్దికాలంగా వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. స్నేహ ఆ వార్తల్ని ధ్రువీకరిస్తూ ఈ ప్రకటన చేసారు. ఆమె చెన్నైలో మాట్లాడుతూ ''పెళ్లి ముహూర్తం గురించి ప్రసన్నతో చర్చిస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాను. చెన్నైలో ఆ వేడుక ఘనంగా జరుగుతుంది అని ఆమె తెలిపారు.

'అచ్చముండు అచ్చముండు' చిత్రంలో ప్రసన్న, స్నేహ కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇక స్నేహ రీసెంట్ గా తెలుగులో చేసిన చిత్రం రాజన్న. విజియేంద్రప్రసాద్ దర్సకత్వంలో నాగార్జున సరసన ఆమె నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. తెలంగాణా పోరాట నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నాగార్జున భార్యగా కనిపించింది. ఆమె తెలుగులో గతంలో రాధా గోపాలం,శ్రీరామదాసు, ప్రియమైన నీకు,సంక్రాంతి, వెంకీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X