గర్భవతి అయిన ఫ్యామిలీ హీరోయిన్ .. సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్
అందం, అభినయం కలిసి ఉండే హీరోయిన్లు అరుదుగా ఉంటారు. అందులో ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు. అందులో ఒకరైన స్నేహా.. కూడా మధ్యలో తన అభిమానులను వదలి వెళ్లంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్నేహా.. తమిళ నాట స్థిరపడింది.

ఫ్యామిలీ హీరోయిన్ సూపర్ హిట్ చిత్రాలు..
ప్రియమైన నీకు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహా.. హోమ్లీ క్యారెక్టర్ ను ప్లే చేస్తూ వచ్చింది. చీరకట్టులో అచ్చం పదహరణాల తెలుగు ఆడపడుచులా ఉండే స్నేహా ఇక్కడి ప్రేక్షకులకు ఇట్టే దగ్గరైంది. రాధాగోపాలం, వెంకీ, సంక్రాంతి, ఏవండోయ్ శ్రీవారులాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

భక్తిరస చిత్రాలతోనూ..
భక్తిరస చిత్రాల్లో నటించిన తన ప్రతిభను నిరూపించింది. రామదాసు చిత్రంలో తన నటన అందర్నీ కట్టిపడేసింది. ఎమోషనల్ సీన్స్లో అందర్నీ కంటతడి పెట్టించింది. పాండురంగడు సినిమాలోనూ నటనతో ఆకట్టుకుంది.

తమిళ హీరోతో ప్రేమ.. పెళ్లి..
తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్నేహా.. హీరో ప్రసన్నను పెళ్లి చేసుకుంది. వీరి ఈ ప్రేమ వివాహాం 2012లో జరిగింది. అయితే వీరికి విహాన్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

పెళ్లి తరువాత సినిమాలకు దూరం..
పెళ్లి తరువాత స్నేహా సినిమాలకు దూరంగా ఉంది. అయితే మంచికథలు వస్తే మూవీస్ చేయడానికి సిద్దంగానే ఉన్నానని చెప్పే స్నేహా.. వినయ విధేయ రామ చిత్రంతో పలకరించింది. పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది.

తాజాగా రెండోసారి గర్భవతి..ఘనంగా సీమంతం వేడుకలు
అయితే రెండో సారి గర్భవతి అయినట్లు ప్రకటించిన స్నేహా ఇంట నేడు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. చాలా దగ్గరి బంధువులను మాత్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











