For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ వేలు పెట్టద్దు..స్నేహ

    By Staff
    |

    Sneha
    హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ నుంచి తప్పుకోవాలని తెగ ప్రయత్నిస్తున్న స్నేహ ఈ మద్య ఓ ప్రెస్ మీట్ లో మీడియా వారిని రిక్వస్ట్ చేస్తున్నానంటూ వార్నింగ్ తరహాలో మాట్లాడింది. ఆమె తెరపై చేసే పాత్రలకు ఆమె మాటలకు పొంతనలేకపోవటంతో వారు అవాక్కయ్యారు. ఇంతకీ ఆమె మాట్లాడింది..ప్లీజ్..మీరు మా వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టద్దు..కెలకద్దు ..గ్యాసిప్స్ రాయద్దు అని. విజయశాంతి కర్తవ్యం చిత్రం రీమేక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఆమెకు ఆమెకు ఆ బాష వంటబట్టిందంటున్నారు.

    ఇంతకీ ఆమె గోల చేసే గ్యాసిప్ ఏమిటంటే.. స్నేహ ఈ మధ్యన ఓ డైరక్టర్ తో ప్రేమలో పడి వార్తల్లో కెక్కింది. అతను మరెవరో కాదు ఆమెతో భవాని ఐపియస్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న కిచా. అతని డైరక్ట్ చేస్తున్నప్పుడే అతని టాలెంట్ చూసి ఆమె మైమర్చిపోయేదని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. అలాగే అతని పేర ఆమె చెన్నైలోని ఓ గుళ్ళో పూజలు చేయించటం కూడా ఆమధ్య ఓ వార్తయింది.దానికామె తన సినిమా కిచా డైరక్ట్ చేస్తున్నాడని అతను బాగుంటే తాము బాగుంటామనే అలా చేసామని చెప్పుకొచ్చింది. అయితే రాత్రిళ్ళు లేట్ నైట్ దాకా పార్టీలు కెళ్ళటం, ఫోన్ ల్లో మాట్లాడటం చూసి ఆమె ఇంట్లో వాళ్ళు నిలదీసారు.

    అలాగే ఈ మధ్య ఓ నటుడు కుమార్తె పెళ్ళికి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఒకరి చేతిలో మరొకరు చేయివేసుకుని వచ్చారు. ఇది అప్పుడే అందరిలో ఆసక్తి కలుగచేసింది. త్వరలోనే పెళ్ళి చేసుకుంటారని వినవచ్చింది. అయితే స్నేహ, కిచా ఇద్దరూ ఈ విషయంపై పెదవి విప్పటం లేదు.ఈ మధ్య ఆమె కిచ తో సహజీవనం చేస్తోందంటూ వార్తలు వచ్చాయి...దాంతో ఆమె ఆ చిత్ర ప్రెస్ మీట్ లో విరుచుకుపడింది.దర్శకుడు మాత్రం ఈ విషయంపై ఏమీ కామెంట్ చేయలేదు...ఖండించనూ లేదు. అదీ సంగతి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X