తప్పే..క్షమించండి:స్నేహ
నా వల్ల ఇబ్బందిపడినవారికి,మనోభావాలు దెబ్బ తిన్నవారందరికీ పేరు పేరునా క్షమాపణ చెప్పుకుంటున్నానంటూ ప్రకటించింది ప్రముఖ సినీ నటి స్నేహ. ఆమె తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించటంతో వివాదం చెలరగింది. అన్ని వర్గాల నుండి వస్తున్న నిరసనలతో ఆమె దిగివచ్చి మీడియా సమక్షంలో నిన్న (సోమవారం)సాయింత్రం క్షమాపణ చెప్పుకుంది. జరిగిన దానికి తాను బాధపడుతున్నాననీ, ఇందువల్ల ఎవరి మనోభాలు దెబ్బతిన్నా వారందరికీ పేరుపేరునా క్షమాపణ చెబుతున్నాననీ ఆమె మీడియాకు తెలిపారు.అలాగే తాను చెప్పులతో గుడిలోకి ఎందుకు ప్రవేశించవలసి వచ్చిందే వివరించారు.
అలాగే తాను చెప్పులతో గుడిలోకి ఎందుకు ప్రవేశించవలసి వచ్చిందే వివరించారు. తన కాలికి గాయమైనందున దూదితో చేసిన పాదరక్షలు ధరించి 'గిరి ప్రదక్షణ' (గిరివాలం)లో పాల్గొన్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి లిఖిత పూర్వకంగా తన క్షమాపణను హిందూ ముణ్ణనికి పంపించాననీ, దీంతో వివాదం సమసిపోతుందని ఆశిస్తున్నాననీ అన్నారు. ఈ వివాదం ఈనెల 3వ తేదీన తన తండ్రితో కలిసి ఆలయంలోకి ప్రవేశించటంతో మొదలైంది. ఆలయ సంప్రదాయం ప్రకారం పాదరక్షలు ధరించి గిరివాలం కార్యక్రమంలో పాల్గొనరాదు. అందుకు భిన్నంగా స్నేహ పాదరక్షలతో పాల్గొందంటూ నిరసనలు పెల్లుబికాయి. స్నేహ 4 రోజుల లోపు క్షమాపణ చెప్పకుంటే ఆమె ఇంటి ముందు ధర్నా చేస్తామని హిందు ముణ్ణని హెచ్చరించింది. దాంతో ఆమె క్షమాపణలతో ముందుకొచ్చారు.


Click it and Unblock the Notifications











