నేనేతప్పూ చెయ్యలేదు- స్నేహ
సినిమాలు తగ్గిపోయాయనో, పబ్లిసిటీ కోసమో కానీ నటి స్నేహ రోజుకో వివాదంలో చిక్కుకొంటోంది. తమిళనాడులోని తిరువణ్ణామలై దేవాలయంలో చెప్పులు వేసుకొని ప్రదక్షిణలు చేసిందంటూ రేగిన వివాదం తెలిసిందే. దీనిపై బహిరంగ క్షమాపనలు చెప్పేవరకూ వదిలేది లేదని హనుమాన్ సేన అల్టిమేటం జారీ చేసింది.
ఈ విషయమై వివరణ ఇచ్చిన స్నేహ, కాలికి గాయం తగలడంతో వైద్యల సూచన మేరకు గుడ్డతో చేసిన కిట్ వాడానని, అవి చెప్పులు కావని అంటోంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు స్నేహ ప్రయత్నిస్తోందని, చెప్పులతో ప్రదక్షిణలు చెయ్యడం ఆమె అహంకారానికి నిదర్శనం అని హనుమాన్ సేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే స్నేహ మాత్రం వివాదాన్ని ఇంకాస్త పొడిగిస్తే పబ్లిసిటీ వస్తుంది కదా అన్న కోణంలో ఆలోచిస్తోందట.
sneha controversy hanuman sena tiruvannamalai tamilnadu bhavani ips స్నేహ వివాదం హనుమాన్ సేన తిరువణ్ణామలై తమిళనాడు భవానీ ఐపియస్


Click it and Unblock the Notifications