అందరూ బికినీ వేస్తున్నారు నేను వేస్తే తప్పేంటి అనుకుందో ఏమిటో స్నేహ బికినీ షో కు సిద్దమైంది. విజయ్ సరసన తాజాగా కమిటయిన ఓ సినిమాలో ఆమె బికినీ షో ఉందని సమాచారం. ఇన్నాళ్ళూ హోమ్లీ హీరోయిన్ గా ఉన్న స్నేహ..అలా ఉంటే ఆఫర్స్ వచ్చేటట్లు కనపడటం లేదని భవాని ఐపియస్ అంటూ విజయశాంతి కర్తవ్యం రీమేక్ కమిటయ్యింది. అందుకోసం ఆమె స్లిమ్ గా తయారైంది. ఇది గమనించిన విజయ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి తన తదుపరి సినిమాలో తన ప్రక్కన చేయటానికి అడిగాడు. ఎగిరి గంతేసిన స్నేహ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దర్శకుడు వచ్చి కథ వినిపించి, అందులో పాత్ర డిమాండ్ మేరకు బికినీ వేయాలని చెప్పాడుట. రోగీ కోరింది..డాక్టర్ చెప్పింది ఒకటే అన్నట్లు గ్లామర్ పాత్రలు కోసం తపిస్తున్న ఆమె మారుమాటలేకుండా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్పేముందని చెప్పిందని సమాచారం. అయితే స్నేహ విప్పి బికినీ వేస్తే చూసే వారున్నారా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.