ఫ్యామిలీ లుక్ తో ఆకట్టుకునే స్నేహకి వరస ఫ్లాప్ లు రావటంతో ఈ మధ్య పెద్దగా కనపడటం లేదు. అయితే ప్రస్తుతం ఆమె గోవా అనే చిత్రంలో బుక్కయింది. ఆ మధ్య వచ్చిన ధ్రిల్లర్ సరోజ(ప్రభుదేవా,వైభవ్,శ్రీహరి)చేసిన దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఇక మొదట ఈ చిత్రంలో ఓ బ్రిటీష్ టూరిస్ట్ పాత్రకు హాలీవుడ్ హీరోయిన్ జెస్సికా ఆల్బాని అనుకున్నారు. అయితే ఆమె చెప్పిన రెమ్యునేషన్ పద్నాలుగు కోట్ల పైగా ఉండటంతో వాళ్ళు కళ్ళు తేలేసారు. అప్పటికీ ఆమె తాను నామినల్ రెమ్యునేషన్ తీసుకుంటున్నానని,తన ఖర్చులకే అవతాయని చెప్పిందని సమాచారం. మరో ప్రక్క సినిమా బడ్జెట్టు ఆరు కోట్లు మాత్రమే.దాంతో నిరాశపడ్డ దర్శకుడు దిగివచ్చి స్నేహాతో సరిపెట్టుకోవటానికి రెడి అయ్యాడు. యువన్ శంకర్ రాజ సంగీతం అందించే ఈ చిత్రంలో మిగతా ముఖ్య పాత్రల్లో జై,శివ,వైభవ్,ప్రేమ్ జి వంటి వారు కనిపించనున్నారు.