స్నేహ ముద్దిస్తానంటే సిగ్గుపడ్డ హీరో!!!
అందాల భరిణె హీరోయిన్ స్నేహ ప్రస్తుతం ఒక తమిళ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ సినిమాలో హీరో చెరణ్. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో హీరోకు ముద్దు ఇచ్చే సీన్ ఉందిట. దర్శకుడు స్నేహకు విషయం చెప్పాడు. స్నేహ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒచ్చిన చిక్కల్లా హీరోకే. స్నేహ ముద్దుకు రెడీ అయినా ఆయనగారు సిగ్గు పడిపోయారు. ఇపుడు దర్శకుడు హీరోకు ధైర్యం చెప్పాల్సి వచ్చిందట. దర్శకుడి చొరవతో ధైర్యం తెచ్చుకున్న చరణ్ స్నేహకు ముద్దిచ్చాడట.
ఇంతకుముందు ముద్దు సీన్లకు నో చెప్పిన స్నేహ ఇపుడు ముద్దు ఎలా ఇచ్చిందబ్బా అనుకుంటున్నారా... తమిళ సినిమా వసూల్ రాజా ఎంబీబీఎస్ సినిమాలో ముద్దుకు నో చెప్పి కమల్ తో చక్కని ముదురు ముద్దు అవకాశం కోల్పోయింది. మరోమారు ముద్దు అనుభవాన్ని మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ముద్దుకు రెడీ అంది. మరి హీరోగారే ముందు బెంగపడ్డారు ఎందుకో మరి.


Click it and Unblock the Notifications











