రజనీ సినిమాలో స్నేహ తల్లి పాత్ర

సినిమాల్లో సంప్రదాయబద్దమైన పాత్రలకే పరిమితం కాకూడదని గ్లామర్ రోల్స్ కూడా పోషించాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. పైగా అటువంటి పాత్రలే ఆమెను వరిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కుచేలుడు సినిమాలో ఆమె ముగ్గురు పిల్లల తల్లి పాత్ర పోషించబోతోంది. అయితే ఆమె రజనీకాంత్ సరసన నటించడం లేదు. రజనీకాంత్ స్నేహితుడి పాత్ర పోషిస్తున్న పశుపతి పాత్రకు భార్యగా ఆమె నటించబోతోంది. పేదరికంతో విలవిలలాడుతున్న ఆ పాత్రకు భార్యగా ఆమె నటిస్తోంది. ఈ పాత్రలో గ్లామర్ కు ఏ మాత్రం చోటు లేదు. ఈ పాత్రకు టబును తీసుకోవాలని సినిమా దర్శకుడు పి. వాసు అనుకున్నారు. అయితే ఇప్పుడు మనసు మార్చుకుని ఆ పాత్రకు స్నేహను ఎంపిక చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











