twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్భంతో ఉన్నా కూడా.. ప్రాక్టిస్ చేసిందట.. వీడియో వైరల్

    |

    కొంతమంది కథానాయికలు నటనపై తమకు ఎంత ప్రేమ, ఇష్టం, అంకితభావం ఉందో చాటిచెబుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన తాము ఇచ్చిన మాటకు నిలబడి సినిమా కోసం నిలబడతారు. ఎన్ని కష్టాలనైనా దిగమింగుతారు. ఇక కొందరైతే తమకు చిన్న తలనొప్పి వచ్చినా షూటింగ్ క్యాన్సల్ చేసే రకాలు కూడా ఉంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్ స్నేహా.. సినిమా పట్ల తనకున్న నిబద్దతను చాటి చెప్పింది.

    ధనుష్ చిత్రంలో..

    ధనుష్ చిత్రంలో..

    ధనుష్ కథానాయకుడిగా నటించిన పటాస్ సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఆడిమురై అనే వర్మకళ ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాని రూపొందించారు. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ చిత్రంలో స్నేహా ఓ ప్రత్యేక పాత్రలో నటించింది.

    సెకండాఫ్‌లో స్నేహా..

    సెకండాఫ్‌లో స్నేహా..

    సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయని టాక్. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో స్నేహ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆడిమురై అనే తమిళంలో ప్రాచీన యుద్ద కళను నేర్చుకునే విద్యార్ధినిగా..అలాగే విద్యను నేర్పించే గురువు గానూ స్నేహ నటించింది.

    గర్భం దాల్చినా పట్టు వదలకుండా..

    అడిమురై శిక్షణ కోసం స్నేహ ఎంతో కఠోరంగా శ్రమించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్నేహ ఈ మూవీ కోసం ఎవరూ ఊహించలేని ఓ సాహసం చేసింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడే స్నేహం గర్భం దాల్చిందట. ఆ విషయం తెలిసీ.. సినిమా నుంచి తప్పుకోకుండా గర్భంతోనే రకరకాల విద్యల కోసం శిక్షణలో పాల్గొన్నట్లు తెలిపింది. తన ఇంట్లోనే ఆ కళకు సంబంధించిన శిక్షణ తీసుకుందని తెలుస్తోంది.

    డూప్ లేకుండా..

    డూప్ లేకుండా..

    పటాస్ చిత్రంలో ఓ సీన్ ప్రకారం చెన్నైలోని గిండి ప్లై ఓవర్ వద్ద పోరాట సన్నివేశంలో స్నేహ అడిమరై కళను ప్రయోగిస్తుంది. అప్పటికి స్నేహ నాలుగు నెలల గర్భిణి అంట. ఆ సీన్లో పట్టు బట్టి మరీ డూప్ ఎవరూ లేకుండా తనే నటించిదిట. ఆ సీన్ తెరకెక్కించే సమయంలో యూనిట్ సభ్యులందరూ టెన్షన్‌కు గురయ్యారట.

    English summary
    Sneha Practicing Adimurai Martial Arts Video Goes Viral. For Dhanush Pattas Movie She Practiced Adimurai. This Movie Is Directed BY Durai Senthil Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X