ప్రేమికుల రోజు...ప్రియుడితో తొడిగించుకున్న స్నేహ
హీరోయిన్ స్నేహ, తమిళ నటుడు ప్రసన్న మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. ఇదిలా ఉంటే ప్రేమికుల దినోత్సవం రోజు ఓ వాణిజ్య సంస్థ నిర్వహించిన కార్య్రకమంలో ఈ ప్రేమ జంట పాల్గొంది. ఈ సందర్భంగా ఆర్గనైజర్లు ప్రజెంట్ చేసిన వజ్రపుటుంగరాన్ని ప్రసన్న స్నేహ చేతికి తొడిగాడు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ...ఈ సమయంలో మా పేరెంట్స్ కూడా ఉండి ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించారు. త్వరలో ఈ జంట ఎంగేజ్మెంట్ జరుపుకోబోతోంది. అనంతరం పెళ్లి తేదీలు ప్రకటించనున్నారు.
2009లో ఓ తమిళ సినిమాలో స్నేహ, ప్రసన్న కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఈ విషయాన్ని గుట్టుగా ఉంచిన ఈ జంట కొన్ని రోజల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించారు.
రజనీకాంత్ హీరోగా ఆయన కూతురు సౌందర్య దర్శకత్వంలో రూపొందనున్న 'కొచ్చాడయాన్' సినిమాలో స్నేహ రజనీ చెల్లెలుగా ఎంపికైంది. తొలుత ఈ ఆఫర్ కు ఓకే చెప్పిన స్నేహ ఇటీవల అర్ధాంతరంగా తప్పకుంది. ఇంట్లో వాళ్లు పెళ్లి ప్రయత్నాలు వేగవంతం చేయడంతో డేట్స్ అడ్జెస్ట్ మెంట్ కాక పోవడం వల్లనే ఆమె ఈ సినిమా నుంచి తప్పకుంది. స్నేహ స్థానంలో రుక్మిణి అనే తమిళ హీరోయిన్ ను ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications











