పెళ్లి టెలికాస్ట్ రైట్స్ అమ్ముకున్న స్నేహ!
ఈ దెబ్బతో మున్ముందు ఇతర సెలబ్రిటీలు కూడా తమ పెళ్లి కార్యక్రమాలకు రేటు కట్టి అమ్ముకునే సంప్రదాయానికి దారి చూపినట్లయింది. ఈ పెళ్లి కార్యక్రమం తమిళ నాట ఉన్న సినీ ప్రేమికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్నేహ అభిమానులు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్పీ రేటింగులు భారీగా పెరుగుతాయని సదరు టీవీ ఛానల్ ఆశిస్తోంది.
'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి ద్వారా ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నామని స్నేహ, ప్రసన్నలు తెలిపారు. పెండ్లి తర్వాత నటించే విషయమై స్నేహదే తుది నిర్ణయమని ప్రసన్న పేర్కొనగా, తానింకా దానిపై ఆలోచించలేదని స్నేహ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
చెన్నయ్‌లోని శ్రీవారి వెంకటాచలపతి కళ్యాణ మండపంలో మే 11, ఉదయం 9 గంటలకు ప్రసన్నతో నటి స్నేహ వివాహం వైభవంగా జరుగుతుందని బంధువులు తెలిపారు.


Click it and Unblock the Notifications












