స్నేహ తనను పెళ్ళి విషయంలో ఇంట్లో వాళ్ళెవరూ బలవంతం చేయరని, అది అదృష్టమని అంటోంది. తనకు ఉన్నట్లే తన అమ్మా, నాన్నలకు కూడా కెరీర్ ఎదగిన తర్వాతే పెళ్ళి అనే భావన ఉన్నదని చెప్తోంది. అదీ ఈ మధ్య ఓ సినీ దర్శకుడుని పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అంటే ప్రపోజల్స్ వస్తున్నాయి గానీ తనకి ఇష్టం లేదని తెగేసి చెప్తోంది. అయినా మ్యారేజెస్ ఆర్ మేడిన్ ఇన్ హెవెన్ అని మళ్ళీ నిట్టూరుస్తోంది. అయినా నీకిష్టం ఉంటే చెప్పు మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేయటం లేదనటం ఎందుకు అంటావు అంటే అలాంటిదేమీ లేదు..మినిమం మూడు సంవత్సరాలు ఆగుతాను అంటోంది.
Story first published: Friday, May 15, 2009, 9:57 [IST]