నేనా..బికినీలోనా..ఛీ.ఛీ...
మొన్నీమధ్య జరిగిన విలేకర్ల సమావేశంలో 'బాపుబొమ్మ' స్నేహ రుసరుసలాడింది. కొందరు జర్నలిస్టులు నిజానిజాలు తెలుసుకోకుండా తమకు తోచినదేదో ఊహించుకొని, అదే నిజమన్నట్టుగా జనంపై రుద్దుతారని వ్యాఖ్యానించింది. ఇంతకీ స్నేహ అంతలా మండిపడటానికి కారణం ఏంటంటే స్నేహ తన తాజాగా నటించిన తమిళ చిత్రం 'గోవా' లో బికినీలో దర్శనమివ్వబోతున్నట్టు ఈ మధ్య మీడియాలో వార్తలొచ్చాయి.
దీనిపై స్పందించిన స్నేహ పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ వార్తలో కూసింతైనా నిజం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ ఈ చిత్రంలో తానో నెగిటివ్ షేడ్ వున్న రోల్ చేస్తున్నానని, ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు కథ చెప్పగానే ఎంతో నచ్చి వెంటనే ఒప్పుకున్నానని తెలిపింది. ఇన్నాళ్లు స్నేహ మంచి బాలిక అనిపించుకున్న స్నేహ నెగిటివ్ రోల్ లో ఏ మేరకు ఆకట్టుకొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











