గుంపులో గోవిందా అని ఫ్యాన్ నడుముగిల్లటంతో బెంబేలెత్తిన హీరోయిన్....
అందాల తారామణులు బయటకు వస్తే కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి ఇబ్బందే నటి స్నేహకు ఈమధ్యే ఎదురైంది. తమిళనాడులోని ఈరోడ్ పెరుందురై ప్రాంతంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది అందాల తార స్నేహ. కార్యక్రమం జరుగుతుండగా అమ్మడిని చూసేందుకు అభిమానులు తోసుకుంటూ ఎగబడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లు ఓ ఆకతాయి స్నేహ నడుముని గిల్లేసరికి, స్నేహ ఉన్నట్టుండి శివంగిలా మారిపోయిందట. సదరు అభిమాని చేయి పట్టుకుని' ఏం..వొళ్ళెలా ఉంది..టూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా నడుము గిల్లడానికి బోనస్ గా స్నేహ స్వయంగా అతగాడి చేయిని పట్టుకోవడంతో ఆ అభిమాని తనను తెగ తిడుతున్నా స్నేహ మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా సిగ్గుపడుతూ తల దించుకున్నాడట. ఆక్రోశం ఆపుకోలేని స్నేహ మాత్రం, అతగాడు కనిపిన్చినంతవరకూ అలా తిట్టుకుంటూనే వెళ్ళిపోయిందట. అభిమానం వెర్రి తలలు వేస్తే…ఇలాంటివే జరుగుతుంటాయి.


Click it and Unblock the Notifications











