రజనీతో స్నేహ కోరిక తీరుతున్న వేళ...

By Bojja Kumar

సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి నటించాలని ప్రతి దక్షిణాది హీరోయిన్ కోరుకుంటుంది. వారిలో స్నేహ కూడా ఒకరు. ఎట్టకేలకు ఆమె కోరిక తీరే సమయం వచ్చింది. రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన తనయ సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాదయన్" పేరుతో తెరకెక్కనున్న సినిమాలో రజనీ చెల్లెలిగా నటించడానికి స్నేహను ఎంపికచేశారు. దీంతో ఈ సుందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయంటున్నారు ఆమె సన్నిహితులు. ఈ విషయమై స్నేహ స్పందిస్తూ 'నా స్వప్నం సాకారమవబోతోంది. రజనీ సర్‌తో నటించాలన్న నా కల ఇన్నాళ్లకు నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో నాది చిన్న పాత్రేం కాదు. ఫుల్‌పూంగ్త్ క్యారెక్టర్‌ను చేస్తున్నాను" అని ఆనందాన్ని వ్యక్తం చేసింది.

'అవతార్" సినిమా తరహాలో పెర్‌ఫ్మాన్స్ క్యాప్చరింగ్ పద్దతిలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సౌందర్యకు దర్శకత్వం కొత్త కావడంతో కె.ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో ఆమె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి కథను కూడా కె.ఎస్. రవికుమారే అందించారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అనుష్కను ఎంపిక చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X