»   » సినీ పాలిటిక్స్ : నాపై కుట్రలు చేసారన్న ధనుష్

సినీ పాలిటిక్స్ : నాపై కుట్రలు చేసారన్న ధనుష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం తమిళనాడులో స్టార్ హీరోగా వెలుగుగొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'రాన్‌జానా' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ అక్కడ కూడా మంచి మార్కులే కొట్టాసారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

బలమైన ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న మీరు సినిమాల్లోకి పెద్దగా కష్టపడకుండా ఎంట్రీ ఇచ్చారుగా...అన్న ప్రశ్నకు ధనుష్ స్పందిస్తూ, 'అది కొంత వరకు నిజమే. కానీ పరిశ్రమలోకి వచ్చాక చాలా మంది నా విషయంలో పాలిటిక్స్ ప్లే చేసారు. చాలా మంది నన్ను ఎదగకుండా తొక్కేయడానికి ప్రయత్నించారు. ఓ సందర్భంలో నటుడిగా నా కెరీర్ ముగిసిందనే పరిస్థితి వచ్చింది' అని చెప్పుకొచ్చారు.

'ఒకప్పుడు సినిమాల విజయం అనేది నటీనటుల ప్రతిభ, దర్శకుల పనితీరు మీద మాత్రమే ఆధార పడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటూ యాచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా రంగంలోకి ఎంటవ్వడం సులభమే కానీ...ఇక్కడ నిలదొక్కుకోవడం మాత్రం చాలా కష్టం' అని ధనుష్ చెప్పుకొచ్చారు.

ధనుష్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'రానా‌జానా' సినిమా విషయానికొస్తే...ధనుష్, సోనమ్ కపూర్ జంటగాలో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ రూపొందించిన చిత్రం 'రాన్‌జానా'. ఈ చిత్రం ఓ బ్రాహ్మణ కుర్రవాడికి, ముస్లిమ్ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ వ్యవహారం చుట్టూ తిరుగుతుంది.

English summary
"The filmi politics almost ended my career as an actor! So many people tried to bring me down. Earlier you only needed to make a film and it would go on to become a hit on its own merit, today you have to beg audiences to watch a film in a theatre" Dhanush told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu