twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సేవానిరతి, మానవతా వాది లారెన్స్‌

    By Staff
    |

    లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌: లారెన్స్‌ వికాలాంగులకు, హృద్రోగ వ్యాధిగ్రస్తులకు చేయుతనివ్వడమే కాకుండా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 60 రకాల రోగాలకు సంబంధించిన శస్త్ర చికిత్సలకు ఆర్థికసాయం అందించారు. తమిళనాట లారెన్స్‌ను నృత్యదర్శకుడిగానే కాకుండా మానవతా వాదిగా కూడా ఎంతో గౌరవమిస్తారు. ఈ నేపధ్యంలో ఆయన సమాజసేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రత్యేక అవార్డునిచ్చి సత్కరించింది. లారెన్స్‌ కేవలం డాన్స్‌మాస్టర్‌గానే కాకుండా దర్శకునిగా 2004లో నాగార్జునతో 'మాస్‌" చిత్రాన్ని అందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనే హీరోగా 'స్టైల్‌" చిత్రాన్ని స్వ యంగా నిర్మించి విజయం సాధించారు.

    అదే బాటలో నడిచి తమిళనాడు ప్రభుత్వంచే ప్రతిష్టాత్మక అవార్డును అం దుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు సినీనటుడు, కొరి యోగ్రాఫర్‌, దర్శకుడు లారె న్స్‌. కొరియోగ్రాఫర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవేంద్ర లారెన్స్‌ ఆరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. లారెన్స్‌ తన చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిరుపేదలను చేరదీసి ఆశ్రయమిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన తమిళ నాడు ప్రభుత్వం లారెన్స్‌కు 'విశిష్ట" అవార్డు ప్రకటించింది. స్వాతంత్య్రదినోత్సవం రోజున చెన్నయ్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. నేడు సినీరంగ ప్రముఖులు కేవలం డబ్బు సంపాదనే పరమావధిలా పెట్టుకోవడంలేదు. వారికి వచ్చిన పేరు ప్రతిష్టలను ఉపయోగించి అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. భగవంతుడు వారికి ఇచ్చిన డబ్బు, హోదాను పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు సినీనటులు నిర్వహించే ఛారిటబుల్‌ ట్రస్ట్‌లకు కొదువలేదు. ఏదో ఒక రకంగా పేద విద్యార్థులకు, వికలాంగులకు ఆర్థింకంగా సహాయం అందించడంలో ముందుంటున్నారు నేటి సినీ రంగ ప్రముఖులు. హాలీవుడ్‌ నుండి మొదలుకొని బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా ప్రతిరంగంలోనూ ఇలాంటి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లను నెలకొల్పి సమాజ శ్రేయస్సుకోసం కొంతమంది సినీజనం పాటు పడడం ఆరోగ్యకర పరిణామం.

    పలు చిత్రాల్లో హీరోగా నటించిన లారెన్స్‌ సామాజిక సేవవైపు అడుగులు వేసి నిరుపేదలను చేరదీసి వారికి సేవ చేస్తున్నారు. లారెన్స్‌కు ఈ అరుదైనా గౌరవం దక్కడం సినీ పరిశ్రమకు ఎంతైనా సంతోషం కలిగించే విషయం. పెద్దమొత్తంలో పారితోషికాలు తీసుకునే హీరోలకు లారెన్స్‌ సేవానిరతి ఆదర్శం కావాలని ఆశిద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X