రజనీకాంత్,ఐశ్వర్యారాయ్ జంటగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రొబొ చిత్రంలో ఫైట్స్ అద్బుతంగా రూపొందుతున్నాయని సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ ని స్పెషల్ గా షూట్ చేసేందుకు యూ పింగ్ యాన్ అనే చైనా స్టంట్ కో ఆర్డనేటర్ ని పిలిపించారు. ఇక అరవై మూడేళ్ళ యాన్ ఇప్పటికే జాకీ చాన్,జెటలీ చిత్రాలకు చాలా వాటికి,క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్,కిల్ బిల్,మాట్రిక్స్ వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసి ఉన్నాడు. అందుకే ఈ చిత్రంలో మార్షిల్ ఆర్ట్స్ మాత్రమే కాక గాలిలో ఎగిరి ఫైట్ చేసే సీక్వెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక నూట నలభై కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం స్వర్గీయ సుజాత (ప్రముఖ సినీ రచయిత)రాసిన En Iniya Iyanthira అనే నవల ఆధారంగా రూపొందుతోంది. అలాగే రజనీ శివాజీ చిత్రం కూడా ఆయనే వ్రాసిన Jeeno Shankar అనే నవల ఆధారంగా రూపొందించటం విశేషం. అలాగే ఈ చిత్రం అన్ని అనులు పూర్తి చేసుకుని ఏప్రియల్ పద్నాలుగు,2010 కి రిలీజ్ చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Story first published: Friday, July 17, 2026, 0:52 [IST]