మానభంగ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయకుడి కొడుకు...!?
ప్రముఖ గాయకుడు యస్ పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు యస్ పి బి చరణ్ తనను మానభంగం చేసేందుకు ప్రయత్నించాడంటూ సోనా అనే తమిళ నటి చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణ చేసేందుకే ఆమె నిన్న చెన్నైలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది. 'మంకత" సినిమా విజయం సాధిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు స్నేహితులు ఇచ్చిన పార్టీకి హాజరైన తనపై యస్ పి బి చరణ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని సోనా బహిరంగంగా ఆరోపించింది.
అంతే కాదు..యస్ పి బి చరణ్ చేయబోయిన నిర్వాకానికి వెంకట్ ప్రభు కూడా మద్దతు పలికాడని..దుశ్చర్యకు పాల్పడుతున్న చరణ్ ను అడ్డగించకపోగా..అతనికి వత్తాసు పలుకుతూ ..తనను వెంకట్ ప్రభు దుర్భాషలాడాడని సోనా ఆరోపించింది...ఈ సంఘటనపై యస్ పి బి చరణ్ మరియు వెంటక్ ప్రభు తక్షణం బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే..తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తమకున్న పలుకుబడితో వారు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తే..ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడతానని సోనా హెచ్చరించింది...!


Click it and Unblock the Notifications











