చరణ్ బహిరంగ క్షమాపణ చెబితే వదిలేస్తా

By Srikanya

ఒక గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన చరణ్ ఇలా ప్రవర్తించడం బాధాకరం. ఇది క్షమించలేని విషయం. చరణ్ నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అంటోంది సోనా. తమిళ్‌లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న సోనా .. గాయకుడు, నటుడు, నిర్మాత, ప్రసిద్ధ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం కుమారుడైన ఎస్.పి. చరణ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బలాత్కారం చేయబోయారని సోనా ఆరోపించడంతో ఈ వివాదం ఆరంభమైంది. చరణ్‌పై సోనా కేసు కూడా పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరణ్ వల్ల నాకు సమస్య ఎదురుకావడం ఇది మొదటిసారి కాదు. పలు సందర్భాల్లో దుర్భాషలాడటంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారాయన. కానీ నేను వాటిని పెద్ద ఇష్యూ చేయలేదు. అయితే అతని చర్యలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని అనిపించింది.

మంగాత్తా విజయాన్ని పురస్కరించుకుని ఆ చిత్రంలో నటించిన వైభవ్ ఇంట్లో సక్సెస్ పార్టీ జరిగింది. ఆ చిత్రదర్శకుడు వెంకట్‌ప్రభు, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్‌ప్రభు నాకు స్నేహితుడు కావడంతో ఆ పార్టీకి పిలిస్తే వెళ్లాను. పార్టీ జరుగుతుండగా హఠాత్తుగా చరణ్ నా దగ్గర అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.వెంకట్‌ప్రభు జోక్యం చేసుకుని చరణ్‌ని పక్కకి తీసుకెళ్లారు. సినిమాల్లో నేను అరకొర దుస్తులేసుకుని డాన్సులు చేస్తాను. అది నా వృత్తి. అలా చేస్తున్నాను కాబట్టి నా కేరక్టర్ చెడ్డది అవ్వదు కదా. నా గురించి ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి నేను మంచిదాన్ని అని చెప్పలేను.ఎస్పీబీ సార్ (ఎస్.పి. బాలసుబ్రమణ్యం) చాలా మంచి వ్యక్తి. నేను పర్సనల్‌గా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతాను. నాకెవరి మీదా ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు. కానీ ఈ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది.ఈ సంఘటన గురించి చరణ్ స్పందిస్తూ నా అడ్వకేట్‌ని సంప్రతించిన తర్వాతే నేనీ విషయం గురించి మాట్లాడతాను. సోనా మాట్లాడినట్లుగా నేను మాటలు జారను. మా మధ్య వ్యాపారపరమైన చర్చలు జరిగాయి. అంతే తప్ప సోనా చెబుతున్నట్లు ఏమీ జరగలేదు. తను అసత్య ప్రచారం చేస్తోంది. చట్టపరంగా ఈ విషయాన్ని ఎదుర్కొంటా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X