మరో అస్త్రంతో-చరణ్ ఇంటి ఎదుట ధర్నాకు సిద్దపడుతోంది...?

By Sindhu

ఇపుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వ్యాంప్ ఆర్టిస్ట్ సోనా పేరే వినబడుతోంది. ఎస్ పి చరణ్ పై సోనా తాజాగా మరో అస్త్రం ప్రయోగిస్తోంది. తనపై ఎస్పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పిబి చరణ్ అత్యాచార యత్నం చేశాడనీ, తన సున్నితమైన భాగాలపై చేతులు వేసి ఇబ్బంది పెట్టాడంటూ, తన దగ్గర బలమైనా ఆధారాలున్నాయంటూ సోనా కేసు పెట్టిన విషయం విధితమే. అంతేకాదు తనపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు బహిరంగ క్షమాపణకు చరణ్ ముందు 10 రోజుల డెడ్‌లైన్ పెట్టింది. ఆ డెడ్‌లైన్ ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోనుంది.

కానీ ఎస్ పిబి చరణ్ మాత్రం స్పందించడం లేదు. పైపెచ్చు, ఆమెకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్లనే తనపై ఇలా దుష్ర్పచారం చేస్తోందని విమర్శించాడు. దీంతో సోనా తన పట్ల చరణ్ ఆ రోజు రాత్రి ఎలా ప్రవర్తించిన తాలూకు వీడియోను పోలీసులకు అందజేసింది. తనకు క్షమాపణ చెప్పకపోతే చరణ్ ఇంటిముందు టెంట్ వేసి ధర్నాకు దిగుతానని హెచ్చరికలు సైతం చేస్తోంది. సోనాకు మద్దతుగా తమిళనాడులో పలు మహిళా సంఘాలు నిలిచాయి. చరణ్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని వారంతా పట్టుబడుతున్నాయి. మరోపక్క ఈ కేసులో ఎస్ పి చరణ్ కి మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X