చరణ్ మ్యాటర్ లో ఆమెకు హార్ట్ స్ట్రోక్

By Srikanya

గత నాలుగు రోజులుగా చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వస్తున్న సోనా చెస్ట్ పెయిన్ తో హాస్పటిల్ లో చేరింది. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైన ఆమె డిప్రషన్ లోకి వెళ్ళటంతో ఈ పరిస్ధితి వచ్చిందని ఆమె కుటుంబసభ్యులు చెప్తున్నారు. వైద్యలు ఆమెకు ట్రీట్ మెంట్ ఇస్తూ ఇది ప్రమాదం కాకపోయినా త్వరగా కోలుకోవాలంటే ఆమె ఒత్తిడినుంచి బయిటపడాలని సూచిస్తున్నారు.ఇక గాయకుడు, నటుడు, నిర్మాత, ప్రసిద్ధ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం కుమారుడైన ఎస్.పి. చరణ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బలాత్కారం చేయబోయారని సోనా ఆరోపించడంతో ఈ వివాదం ఆరంభమైంది. చరణ్‌పై సోనా కేసు కూడా పెట్టారు. సోనా కథనం ప్రకారం మంగత్తా(తెలుగులో గాంబ్లర్) అనే తమిళ సినిమా సక్సెస్ పార్టీలో ఎస్పీ చరణ్ తన పై అత్యాచార యత్నం చేసాడని, అక్కడే ఉన్న దర్శకుడు వెంకట ప్రభు అసభ్యంగా తనను దూషించాడని ప్రెస్ మీట్ లో చెప్పింది. ఈ విషయమై ఆమె పాండీబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు.

నటి సోనా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కాని రెమ్యునరేషన్ డిమాండ్ ఒప్పందం కుదరక సోనా ఆ సినిమా వదులుకుంది. ఆ సినిమాకు ఇచ్చిన డేట్స్ ను గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్ తనకు ఇమ్మని శ్లేషార్ధాలతో అడిగారని, ఆ తరువాత అఘాయిత్యం చేయబోయారని ఆమె కథనం. పది రోజులు లోపు తనకు ఎస్పీ చరణ్, వెంకట ప్రభు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్పీ చరణం కథనం మరోలా ఉంది. తనకు నటి సోనాకు ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని, పార్టీకి అటెండ్ అవ్వడం, బిజినెస్ గురుంచి ఆమెతో మాట్లాడటం నిజమేనని, కాని మిస్ బిహేవ్ చేయలేదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ చరణ్ తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెంకట ప్రభు సినిమాలలో నటుడిగా కూడా చరణ్ కనిపించారు.ఇక వెంకట్ ప్రభు అస్సలు తాము మంగత్తా కి సక్సెస్ పార్టీనే జరపలేదని,అది కేవలం తమ స్నేహితుడు వైభవ్ ఇచ్చిన పార్టినే అని చెప్పటం గమనార్హం.ఇక వైభవ్ మరెవరో కాదు..తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X