Don't Miss!
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పోలీసులు వార్నింగ్ తో ఆమె ఆపింది
సోనా, ఎస్పీ చరణ్ ఇష్యూ గత కొద్దిరోజులుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. బహిరంగ క్షమాపణ అడిగిన ఆమె చరణ్ దానికి ఒప్పుకోకపోవటంతో చెన్నైలోని అతని ఇంటిముందు ధర్నాకు దిగబోయింది. అయితే ఈ లోగా చెన్నై పోలీసులు కలగచేసుకుని ప్రోపర్ ఫర్మిషన్ లేకుండా అలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏదన్నా ఉంటే కోర్డులో చూసుకోమని ఆమెను హెచ్చరించారు. దాంతో సోనా,ఆమెకు సపోర్టుగా వచ్చిన మహిళలు వెనక్కి వెళ్లవలసి వచ్చింది. ఇదీ చరణ్ కుట్రే అని ఆమె ఆరోపిస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆమె ఎగ్మూర్‌లోని పోలీసు కమిషనరేట్‌కు వచ్చిన సోనా వీడియో ఆధారాలను కమిషనర్‌కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తాను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నానంటూ చరణ్ రూమర్స్ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు వైభవ్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అవే నిజం చెబుతాయని అన్నారు. చరణ్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించానని ప్రచారం చేయడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. సినిమాల్లో గ్లామరస్‌గా నటించినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తాను తప్పు చేసి ఉంటే దర్శకుడు వెంకట్ ప్రభు సహకారంతో చరణ్ ఎందుకు రాజీకి ప్రయత్నించారని సోనా ప్రశ్నించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ఎందుకు హైకోర్టును ఆశ్రయించారో చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా చరణ్ తరఫున కొంతమంది సినీ పెద్దలు సోనాతో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదని సమాచారం.