వీడియో ఆధారముందని చరణ్ కి వార్నింగ్

By Srikanya

చరణ్ కేసు మరో మలుపు తిరిగింది. అతను అసభ్యంగా ప్రవర్తించాడు అన్నదానికి ఆధారాలు వీడియో రూపంలో ఉన్నాయని సోనా స్పష్టం చేస్తోంది. దాంతో చరణ్ కి టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. ఇక
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎస్పీబీ చరణ్‌ను వదిలే ప్రసక్తే లేదని నటి సోనా స్పష్టం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆమె ఎగ్మూర్‌లోని పోలీసు కమిషనరేట్‌కు వచ్చిన సోనా వీడియో ఆధారాలను కమిషనర్‌కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నానంటూ చరణ్ రూమర్స్ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు వైభవ్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అవే నిజం చెబుతాయని అన్నారు. చరణ్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించానని ప్రచారం చేయడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. సినిమాల్లో గ్లామరస్‌గా నటించినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తాను తప్పు చేసి ఉంటే దర్శకుడు వెంకట్ ప్రభు సహకారంతో చరణ్ ఎందుకు రాజీకి ప్రయత్నించారని సోనా ప్రశ్నించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ఎందుకు హైకోర్టును ఆశ్రయించారో చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా చరణ్ తరఫున కొంతమంది సినీ పెద్దలు సోనాతో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X