కూతురు వయస్సున్న ఆమెతో కమల్ హాసన్ రొమాన్స్
కమల్ హాసన్, సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంలో దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నే హీరోయిన్ గా ఎంపికచేసారు. తెలుగు,హిందీ, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇక ఈ విషయమై బాలీవుడ్ లో అప్పుడే రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. సోనాక్షి సిన్హా వయస్సు...కమల్ కూతురు శృతి హాసన్ కన్నా ఒక్క యాడాది మాత్రమే ఎక్కవేనని, కూతురు వయస్సు ఉన్న ఆమెతో ఎలా జోడీ కడతాడని అంటన్నారు. అలాగే ఈ చిత్రం రెడ్లీ స్కాట్ హాలీవుడ్ చిత్రం ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ కు సీక్వెల్ హానీబాల్ ప్రేరణగా రూపొందుతోందని, ఇందులో కమల్ ..సైకోపాత్ కిల్లర్ గా కనిపిస్తాడని చెప్తున్నారు. సోనాక్షి..జూలియా మూర్ పాత్రను చేస్తుందని వినికిడి.
కమల్ హాసన్ సెల్వ రాఘవన్ సోనాక్షి సిన్హా సైకోపాత్ శృతిహాసన్ kamal hassan sonakshi sinha redly scott sruthi hassan selvaraghavan


Click it and Unblock the Notifications