మొగుడు కాదన్నా...మామ గారు ఆ హీరోయిన్ ని చేరదీస్తున్నాడు
రీసెంట్ గా డైవర్స్ తీసుకున్న సోనీ ఆగర్వాల్ (7 బై జీ బృందావన కాలనీ ఫేమ్) గుర్తుందా. తన భర్త సెల్వ రాఘవన్ తో విడాకులు తీసుకున్న ఆమె అవకాశాలు కోసం ట్రై చేస్తోంది. అది గమనించిన ఆమె మామగారు(సెల్వరాఘవన్ తండ్రి) కస్తూరి రాజా ఆమెకు ఆఫర్ ఇచ్చారు. ఆమెను గౌరవంగా తన ఆఫీసుకు ఆహ్వానించి తను తీస్తున్న పాండియ పేరరసు చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. మామే స్వయంగా అవకాశమిస్తాననడంతో సోనీ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారని తెలిసింది. ఈ చిత్రంతో ఆమె తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందని ఆశిస్తోంది. ఇక సెల్వరాఘవన్ తో ఆమె ప్రేమ కాదల్‌కొండేన్ చిత్రం షూటింగ్ సమయంలో మొదలైంది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. అయితే వీరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం సాగలేదు. వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలు విడాకుల వరకు తీసుకెళ్లాయి. తర్వాత సోనీ ఒక టీవీ సీరియల్‌లో నటించారు. నచ్చిన పాత్రలు వస్తే మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమని ప్రకటించిన ఆమెకు పలు అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది. ఏదైమైనా భర్త వద్దనుకున్నా మామగారు అభిమానంతో చేరదీసి ఆఫర్ ఇవ్వటం మాత్రం చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











