హీరోతో అఫైర్ నడుపుతున్న డైరెక్టర్ భార్య..!?
హీరోయిన్ గా స్ట్రగుల్ అవుతున్న దశలో సోనియా అగర్వాల్ కెరీర్ ని చక్కదిద్ది ఆమెకంటూ గుర్తింపు తెచ్చిపెట్టాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్ మూడేళ్లకు పైగా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని కనీసం మూడేళ్లు కూడా కలిసుండలేకపోయారు. సోనియా, సెల్వరాఘవన్ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకోగా, రీసెంట్ గా అతను రెండో పెళ్లికూడా చేసేసుకున్నాడు. అంతే కాకుండా కొత్తగా వచ్చిన భార్య తనకి అన్ని విధాల అనుకూలవతి అని, నిజమైన ప్రేమంటే ఏమిటో ఈమె ద్వారానే తెలిసిందని కూడా అన్నాడు.
తన మాజీ భర్త అంతకు తెగిస్తే తాను మాత్రం ఎందుకు ఒంటరిగా ఉండాలని అనుకుందో ఏమో, సోనియా అగర్వాల్ ఈసారి హీరోతో అఫైర్ పెట్టుకుంది. కన్నడ హీరో సుదీప్ తో సోనియా వ్యవహారం జోరుగా నడుస్తున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. సుదీప్ కూడా మొదటి భార్యకి విడాకులిచ్చేసి ఉండడంతో 'మావిడాకులు" సినిమా తరహాలో వీళ్లిద్దరికీ మ్యాచ్ పక్కాగా కుదిరిందని సినీ జనం అనుకుంటున్నారు. కాగా సోనియా అగర్వాల్ ప్రస్తుతం తెలుగు 'వేదం" తమిళ్ రీమేక్ క్రిష్ దర్శకత్వంలో 'వానం" చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











